Samantha
Samantha: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరీ’.. సోమవారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌తో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ని సర్ ప్రైజ్ ఇచ్చారు డైరెక్టర్.
Love Story : లేట్ అయినా లేటెస్ట్‌గా ‘లవ్ స్టోరీ’..
అంచనాలకు అందకుండా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, చైతు, సాయి పల్లవిల సూపర్బ్ పర్ఫామెన్స్, డ్యాన్స్ మూమెంట్స్, ముఖ్యంగా తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ విపరీతంగా ఆకట్టకుంటున్నాయి. ట్రైలర్ చూసిన వాళ్లంతా సినిమా పక్కా సూపర్ హిట్ అంటున్నారు.
Love Story Trailer : ‘చస్తే చద్దాం.. కానీ తేల్చుకుని చద్దాం’.. చైతు బెస్ట్ పెర్ఫార్మెన్స్..
రీసెంట్‌గా భర్త ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ మీద సమంత స్పందించారు. చైతు ట్వీట్‌ని రీ ట్వీట్ చేస్తూ.. ‘విన్నర్.. ఆల్ ది వెరీ బెస్ట్ టు ది టీమ్’.. అంటూ సాయి పల్లవిని ట్యాగ్ చేస్తూ #LoveStoryTrailer హ్యాష్ ట్యాగ్‌తో కామెంట్ చేశారు. అయితే సామ్ రీ ట్వీట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.
WINNER!!
All the very best to the team @Sai_Pallavi92 ?.. #LoveStoryTrailer https://t.co/nt9rzTc3lY— S (@Samanthaprabhu2) September 13, 2021
సామ్, చైతు ట్వీట్‌ని రీ ట్వీట్ చేస్తూ.. సాయి పల్లవి పేరు ప్రస్తావించింది. అలాగే టీంకి విషెస్ చెప్పింది. మరి చైతన్య పేరు ఎందుకు చెప్పలేదు అని కొందరు అంటుంటే.. భర్త ట్వీట్‌నే కదా ఆమె రీ ట్వీట్ చేసింది. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది అనేది కొందరి వెర్షన్. భర్త సినిమా ట్రైలర్ గురించి రెస్పాన్స్ అయింది కాబట్టి గతకొద్ది రోజులుగా వస్తున్న బ్రేకప్ వార్తలు అవాస్తవం.. ఇదే క్లారిటీ అంటున్నారు.
ఇకపోతే.. ఈ ఏడాది జనవరి 10న ‘లవ్ స్టోరీ’ టీజర్ రిలీజ్ అయ్యింది. అప్పుడు కూడా చైతన్య ట్వీట్‌ని రీ ట్వీట్ చేసింది సామ్.. భర్తను ట్యాగ్ చేస్తూ.. ‘You just keep going from Strenght to Strenght’ అని కామెంట్ చేసింది. దీంతో.. ఇదిగో ప్రూఫ్ అంటూ.. ఆ ట్వీట్‌ని పోస్ట్ చేస్తూ.. ఇప్పుడు బ్రేకప్ అవబోతున్నారు కాబట్టే సమంత – నాగ చైతన్య పేరు చెప్పలేదు అని కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.