Samantha Ruth Prabhu says she let go of 15 brand endorsements lost crores
సినీ నటులు సినిమాల ద్వారా మాత్రమే కాకుండా యాడ్స్, పలు వ్యాపారాలు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తుంటారు. అందరు ఇలా చేస్తారని చెప్పడం లేదుగానీ.. స్టార్ నటీనటులు మాత్రం ఈ జాబితాలో ఉంటారు. ఓ స్టార్ హీరోయిన్ మాత్రం సంవత్సర కాలంలో 15 బ్రాండ్ ను వదులుకోవడంతో కోట్లు నష్టపోయిందట. ఈ విషయాన్ని సదరు హీరోయినే స్వయంగా చెప్పింది. ఇంతకు ఆమె ఎవరో కాదు నటి సమంత.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. తాను 20 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలో అడుగుపెట్టినట్లుగా చెప్పుకొచ్చింది. అప్పట్లో సక్సెస్ అంటే.. ఎన్ని ప్రాజెక్ట్‌లు చేశాం. ఎన్ని యాడ్స్ చేస్తున్నాం. ఎన్ని పెద్ద బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నామనే దానిపైనే ఉండేదన్నారు.
Tollywood : రెమ్యునరేషన్ కోట్లలో.. కలెక్షన్స్ లక్షల్లో..
అప్పట్లో తాను ఎన్నో మల్టీనేషనల్ బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో అది తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. అయితే.. కొన్ని బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం వల్ల నష్టం చేకూరుతున్నట్లు తెలుసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు.
మనం ఉత్పత్తులను ప్రమోట్ చేసేటప్పుడు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలనే విషయాన్ని తెలుసుకున్నాను. ఒకప్పుడు ఇష్టం వచ్చిన బ్రాండ్స్‌కు అంబాసిడర్ గా ఉన్నందుకు నాకు నేను క్షమాపణ చెబుతున్నా. గడిచిన ఏడాది కాలంలో సుమారు 15 ఎండార్స్‌మెంట్‌లను వదులుకున్నాను. దీని వల్ల కోట్లలో నష్టపోయాను. అని సమంత అంది.
ఇప్పటికి నా వద్దకు ఎన్నో ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్య ప్రకనల ఆఫర్స్ వస్తుంటాయి. అయితే.. నేను ఇప్పుడు ఏదైన బ్రాండ్‌లను ప్రమోట్ చేసే ముందు ముగ్గురు వైద్యులతో తనిఖీ చేస్తాను. అవి సమాజానికి ఎటువంటి హాని చేయవని నిర్ణయించుకున్నాకే ప్రమోట్ చేస్తున్నాను అని సమంత చెప్పింది.