Samantha
Samantha : చైతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్ గా ఉంటుంది. ఇక సమంత పెట్టే పోస్టులు, స్టోరీలు ప్రతి సారి చర్చంశనీయంగా మారుతున్నాయి. విడాకుల తర్వాత సమంతని ట్రోల్ చేసే వారే ఎక్కువగా పెరిగారు. విడాకుల తర్వాత సమంత రెచ్చిపోయి బోల్డ్ ఫోటోలు దిగడం, ఐటెం సాంగ్స్ చేయడం లాంటివాటితో ఈ ట్రోల్స్ మరింత పెరిగాయి. అప్పుడప్పుడు ఈ ట్రోల్స్ కి ఘాటుగానే స్పందిస్తుంది సమంత.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత తాజాగా తన ట్విట్టర్ లో ఓ సీరియస్ ట్వీట్ పెట్టింది. దీంతో సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఎవరికోసం ఈ ట్వీట్ పెట్టిందో అని అంతా చర్చించుకుంటున్నారు. సమంత.. ”నా మౌనం అజ్ఞానం అని, నా సైలెన్స్ అన్నిటికి అంగీకరిస్తున్నానని, నా దయని బలహీనత అని అనుకోకండి. దయాగుణానికి కూడా ఓ చివరి డేట్ ఉంటుంది. జస్ట్ చెప్తున్నాను అంతే” అంటూ కాస్త సీరియస్ గానే ట్వీట్ చేసింది.
Akira Nandan : ఫస్ట్ టైం ఆ పని చేసిన అకిరా.. అభినందిస్తున్న పవన్ ఫ్యాన్స్..
ఇప్పుడు సమంత చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసింది అని తలలు పట్టుకుంటున్నారు. మళ్ళీ ఎవరైనా సమంతని ట్రోల్ చేశారా? లేక సమంతని ఎవరైనా ఏమన్నా అన్నారా అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఇక సమంత అభిమానులు ఈ ట్వీట్ ని మరింత షేర్ చేసి సమంతతో జాగ్రత్త అంటూ పోస్టులు పెడుతున్నారు. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఈ ట్వీట్ పై స్పందిస్తున్నారు. మరి సమంత ఇంత సీరియస్ గా ట్వీట్ ఎందుకు చేసిందో తనకే తెలియాలి.
Yash : రాకింగ్ స్టార్ యశ్‌కి ఆ హీరోయిన్‌తో కలిసి నటించాలని ఉందట..
సమంత పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఇలా పోస్ట్ చేసిన వెంటనే సమంత మరో పోస్ట్ వేసింది. దయాగుణం, మంచితనానికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది అని చెప్పుకొచ్చింది సమంత. ఇక ఇప్పుడు నెట్టింట్లో ఓ వార్ జరుగుతోంది.
Kindness can have an expiry date ☺️#JustSaying https://t.co/UDc40uaLpv
— Samantha (@Samanthaprabhu2) April 22, 2022