Samantha : సమంత శాకుంతలం సినిమా అలా కూడా రిలీజ్ అంట.. అభిమానులకి పండగే..

తాజాగా శాకుంతలం సినిమా నిర్మాత నీలిమ గుణ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ ని తన ట్విట్టర్ తెలిపింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి నీలిమ గుణ సమాధానమిస్తూ........................

Samantha shakunthalam movie releasing in 3D

Samantha :  సమంత చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే యశోద సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించి మంచి విజయం సాధించింది. అయితే తనకు మాయోసైటిస్ సోకడంతో ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో ఇంటివద్దే ఉంటూ చికిత్స తీసుకుంటుంది. తన చేతిలో సినిమాలు ఉన్నా ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రస్తుతానికి షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చింది.

అయితే సమంత మెయిన్ లీడ్ లో గుణశేఖర్ దర్శకత్వంలో పురాణాల్లోని శకుంతల కథని ‘శాకుంతలం’ పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దుశ్యంతుడు-శాకుంతలం కథని అందంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో దుశ్యంతుడిగా మలయాళం నటుడు దేవ్ మోహన్ నటిస్తుండగా శకుంతలగా సమంత నటిస్తుంది. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ కూతురు అర్హ సినీ ప్రవేశం చేయబోతుంది. శకుంతల చిన్నప్పటి పాత్రని అర్హ వేయనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది ఈ సినిమా.

18 Pages Movie Review : కొత్త కథనంతో.. అదరగొట్టేసిన నిఖిల్, అనుపమ.. 18 పేజెస్ రివ్యూ..

తాజాగా శాకుంతలం సినిమా నిర్మాత నీలిమ గుణ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ ని తన ట్విట్టర్ తెలిపింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి నీలిమ గుణ సమాధానమిస్తూ.. శాకుంతలం ఒక అందమైన ప్రేమ కథ. ప్రకృతి ఒడిలో జంతువులు, ప్రకృతితో సాగే అందమైన కథ. శకుంతల ప్రకృతితో మమేకమైన తీరు, దుశ్యంతుడితో శకుంతల ప్రేమ, దుశ్యంతుడి పరాక్రమం.. ఇలాంటివన్నీ 3D లోనే చూడాలి. అప్పుడు సినిమాని ఇంకా బాగా ఆస్వాదించగలరు. అందుకే శాకుంతలం సినిమాని 3D లో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించింది. సమంత సినిమా 3D లో వస్తుంది అనడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం సామ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు.