Samantha : వామ్మో సమంత ఈ రేంజ్‌లో బాడీ పెంచుతుంది ఏంటి? ఫుల్ ఫిట్నెస్ మోడ్‌లో సమంత..

అప్పుడప్పుడు సమంత తన ఫిట్నెస్, జిమ్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

Samantha Shares her Gym body Photo it goes Viral

Samantha : సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి తన హెల్త్, బిజినెస్ లపై ఫోకస్ పెట్టింది. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో, బయట ఈవెంట్స్ తో రెగ్యులర్ గా జనాల్లో ఉంటుంది. ఈవెంట్స్ లో పాల్గొంటూ, ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది. ఇక సమంత మాయోసైటిస్ వచ్చిన తర్వాత ఫుల్ గా హెల్త్ మీద, ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.

అప్పుడప్పుడు సమంత తన ఫిట్నెస్, జిమ్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటో షేర్ చేసింది. సమంత జిమ్ లో వెనక్కి తిరిగి తన బ్యాక్ బాడీ, చేతులు చూపిస్తూ ఓ ఫోటోని షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

Also Read : Ram Charan : బ్యాంకాక్ వెకేషన్ నుంచి వచ్చిన రామ్ చరణ్.. మళ్ళీ ‘గేమ్ ఛేంజర్’ షూట్ మొదలు.. ఎప్పుడు? ఎక్కడ అంటే..?

సమంత షేర్ చేసిన ఈ జిమ్ ఫోటోని చూసి వామ్మో సమంత ఈ రేంజ్ లో బాడీ పెంచుతుందా? ఫుల్ ఫిట్ గా తయారవుతుందిగా అని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సమంత తన జిమ్ బాడీని షేర్ చేస్తూ అమన్ కరాని అనే తన ఫిట్నెస్ ట్రైనర్ ని ట్యాగ్ చేసింది. ఇక సమంత చేతిలో ప్రస్తుతం సినిమాలు ఏమి లేకపోయినా గతంలో చేసిన సిటాడెల్ సిరీస్ త్వరలో అమెజాన్ లో రిలీజ్ కానుంది.