samantha shocking comments at ndtv world summit 2025
Samantha: సౌత్ బ్యూటీ సమంత గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. నాగ చైతన్యతో విడాకుల తరువాత ఆమె మాయిసైటిస్ వ్యాధి బారిన పడిన ఆమె ఇటీవలే కోలుకొని మళ్ళీ తెరపై కనిపించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే, రీసెంట్ గా ఆమె (Samantha)యెన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సామ్ తన వ్యక్తిగత, సినిమా విషయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆలాగే విడాకుల సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్ గురించి కూడా ఆమె ప్రస్తావించింది.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. “నా జీవితంలో జరిగినా ప్రతీది ప్రజల సమక్షంలోనే జరిగింది. విడాకుల విషయంలో, హెల్త్ విషయంలో ఎంత స్ట్రగుల్ అయ్యాను అనేది కూడా తెలుసు. ఆ సమయంలో నాపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో అలా ఉండబట్టే ఇలా జరిగిందని జెడ్జిమెంట్లు కూడా ఇచ్చేశారు. నా జీవితంలో జరుగుతున్నవాటికి సమాధానం నాకు తెలియవు కానీ, వాటి గురించి మాట్లాడాల్సి వస్తోంది. నేనేమి పర్ఫెక్ట్ కాదు. నేనూ తప్పులు చేశాను.. దెబ్బలు తిన్నాను.. కానీ, ఇప్పుడు బెటర్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చింది సమంత. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో “రక్త్ బ్రహ్మాండ్” సినిమా చేస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులో సమంత చేస్తున్న సినిమా “మా ఇంటి బంగారం”. నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. మరి చాలా గ్యాప్ తరువాత సమంత చేస్తున్న ఈ రెండు సినిమాలు ఆమెకు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తాయి అనేది చూడాలి.