Samantha : సమంతను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా?

లండన్ లో సమంత బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే పలువురు నెటిజన్లు సమంతను ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం సమంత అక్కడ మీడియాతో మాట్లాడిన యాక్సెంట్.

Samantha trolled by netizens for her english speech

Samantha :  స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఇటీవలే శాకుంతలం(Shakunthalam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం సమంత బాలీవుడ్(Bollywood) లో సిటాడెల్(Citadel) సిరీస్, తెలుగులో ఖుషి(Kushi) సినిమా చేస్తుంది. ఇటీవల హాలీవుడ్ సిటాడెల్ సిరీస్ ప్రీమియర్ కు సమంత ఇండియన్ సిటాడెల్ యూనిట్ తో కలిసి లండన్ కు వెళ్ళింది.

లండన్ లో సమంత బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే పలువురు నెటిజన్లు సమంతను ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం సమంత అక్కడ మీడియాతో మాట్లాడిన యాక్సెంట్. వేరే దేశాల్లో ఇంగ్లీష్ యాక్సెంట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇండియా నుంచి వెళ్ళిన సెలబ్రిటీలు చాలావరకు మామూలుగానే మాట్లాడతారు. మనకు అక్కడి యాక్సెంట్ అలవాటు ఉండదు కాబట్టి. కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఆ యాక్సెంట్ నేర్చుకొని మాట్లాడితే, మరికొంతమంది మాత్రం ఆ యాక్సెంట్ ని ట్రై చేసి నవ్వులపాలవుతారు.

Samantha : ఇప్పటికింకా నా వయసు పదహారే.. 16 ఏళ్ళప్పటి సమంత ఎలా ఉందో చూశారా?

ఇప్పుడు సమంత అదే చేసింది. లండన్ లో సిటాడెల్ ప్రీమియర్ తర్వాత అక్కడ ఉన్న సెలబ్రిటీలు మాములు ఇంగ్లీష్ మాట్లాడినా సమంత మాత్రం అక్కడి యాక్సెంట్ ని ట్రై చేసింది. అది అంతగా వర్కౌట్ కాకపోవడంతో నెటిజన్లు సమంతను మరోసారి ట్రోల్ చేస్తున్నారు. మనకి రాని యాక్సెంట్ అవసరమా, అందరూ బాగానే మాట్లాడుతున్నారుగా నీకేమైంది, ఇండియన్ యాక్సెంట్ లో మాట్లాడలేవా?, అప్పుడే హాలీవుడ్ హీరోయిన్ రేంజ్ లో ఊహించుకుంటున్నావా అంటూ సమంతని ట్రోల్ చేస్తూ కామెంట్స్, పోస్టులు చేస్తున్నారు నెటిజన్లు.