Samantha
Samantha : సమంత చైతూతో విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపొయింది. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క స్నేహితులతో కలిసి ట్రిప్పులు వేస్తుంది, ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తుంది. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో గతంలో కంటే మరింత యాక్టీవ్ గా ఉంటుంది. ఒకప్పుడు సమంత తన సినిమాలతో వార్తల్లో ఉంటే ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు, ట్వీట్స్‌తో వార్తల్లో నిలుస్తుంది.
Yash : ‘సలాం రాఖీ భాయ్’ అంటూ యశ్ కూతురు హంగామా.. వైరల్ అవుతున్న వీడియో..
సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసే కొటేషన్స్, ట్విట్టర్ లో పెట్టే ట్వీట్స్ ఎవరిని ఉద్దేశించో అర్ధం కాక సతమతమవుతున్నారు నెటిజన్లు. ఇటీవల చాలా సీరియస్ గా పెట్టిన ఓ ట్వీట్ బాగా వైరల్ అయింది. తాజాగా ట్విట్టర్ లో #asksam పేరుతో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. ఇందులో భాగంగా పలువురు అభిమానులు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి సమాధానాలిచ్చింది. ఓ నెటిజన్ మీకు ఒకేసారి ఎదురవుతున్న ఎక్కువ ప్రేమ, ద్వేషాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని అడగగా, సమంత దానికి సమాధానమిస్తూ..”ఈ ప్రేమ, ద్వేషం లాంటి వాటిలో మళ్ళీ పడకుండా ఉండటానికి ట్రై చేస్తాను. వీటికి చాలా దూరంగా ఉండటం మంచిది” అంటూ రిప్లై ఇచ్చింది. అయితే ఇది మాత్రం చైతూని ఉద్దేశించే చెప్పిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైతేనేం మరోసారి తన ట్వీట్స్ తో మళ్ళీ వార్తల్లో నిలుస్తుంది సామ్.
I try not to buy into the love or the hate .. stay a safe distance away from it all ♥️#AskSam https://t.co/RyLXiPjxca
— Samantha (@Samanthaprabhu2) April 29, 2022