Samantha: 1800 పైగా థియేటర్లో సమంత యశోద టీజర్ రిలీజ్.. ప్రెగ్నెన్సీతో సమంత యాక్షన్స్

తెలుగులో లేడీ సూపర్ స్టార్ గా ఎదుగుతున్న సమంత వరుసపెట్టి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఒప్పుకుంటుంది. హీరో నాగ చైతన్యతో విడిపోయాక సమంత పూర్తిగా సినిమాలతో లీనమైపోయింది. కాగా శుక్రవారం "యశోద" మూవీ టీం టీజర్ రిలీజ్ చేసింది. టీజర్ మొత్తం మంచి ఉత్కంఠభరితంగా నడిపించారు డైరెక్టర్లు.

Samantha Yashoda Teaser Released

Samantha: తెలుగులో లేడీ సూపర్ స్టార్ గా ఎదుగుతున్న సమంత వరుసపెట్టి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఒప్పుకుంటుంది. హీరో నాగ చైతన్యతో విడిపోయాక సమంత పూర్తిగా సినిమాలతో లీనమైపోయింది. కేవలం సినిమాలే కాకుండా “ఓటీటీ” ఫ్లాట్ ఫార్మ్స్ లో ప్రసారమయ్యే ‘వెబ్ సిరీస్’లలో కూడా నటిస్తూ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆ క్రమంలోనే తను నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 నార్త్ సైడ్ సామ్ కి ఎంతటి క్రేజ్ తెచ్చిపెట్టిందో చెప్పనక్కర్లేదు.

Samantha: సమంతపై వస్తున్న ఆ రూమర్ లో నిజంలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆమె పర్సనల్ మేనేజర్

ప్రస్తుతం ఆమె మరో వెబ్ సిరీస్ ని కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అలాగే గుణ శేఖర్ తెరకెక్కిస్తున్న “శాకుంతలం”, తమిళ డైరెక్టర్స్ హరి-హరీష్ లు తెరకెక్కిస్తున్న “యశోద” సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. కాగా శుక్రవారం “యశోద” మూవీ టీం టీజర్ రిలీజ్ చేసింది. టీజర్ మొత్తం మంచి ఉత్కంఠభరితంగా నడిపించారు డైరెక్టర్లు.

ఈ సినిమాలో సమంత.. సమస్యలో చిక్కుకున్న ఒక గర్భవతిగా కనిపించబోతున్నట్టు టీజర్ చూస్తే అర్ధమవుతుంది. భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ను 1800 పైగా థియేటర్లో విడుదల చేశారు. ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళి శర్మ వంటి హేమాహేమీలు ఈ సినిమాలో నటిస్తున్నారు. సస్పెన్స్ జోనర్ లో వస్తున్న ఈ మూవీ సమంతని పాన్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ ని చేస్తుందేమో చూడాలి.