Sampoornesh Babu new movie Martin Luther King trailer released
Martin Luther King : టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు పేరడీ సినిమాలతో ముందుకు సాగుతూ వెళ్తున్నాడు. అయితే ఈసారి పేరడీ కాకుండా ఒక కామెడీ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాతో రాబోతున్నాడు. ఇటీవల ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే టైటిల్‌తో ఒక మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ అనౌన్స్‌మెంట్ తో రిలీజ్ చేసిన పోస్టర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
పొలిటికల్ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఊరికి దక్షిణాన ఉన్న వాళ్ళు సౌత్ గ్రూప్ గా, ఉత్తరాన ఉన్న వాళ్ళు నార్త్ గ్రూప్ గా విడిపోయి నిత్యం గొడవపడుతుంటారు. ఈమధ్యలో పంచాయతీ ఎన్నికలు రావడంతో నార్త్ నుంచి నరేష్ ఒకరు, సౌత్ నుంచి ఒకరు ఎన్నికల పోటీలోకి దిగుతారు. ఊరిలో అన్ని ఓట్లు సమానంగా అటు ఇటు సరిపోగా.. సంపూర్ణేష్ బాబు ఓటు కీలకంగా మారనుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ట్రైలర్ కామెడీగా ఎంటర్టైనింగ్ గా సాగింది.
Also read : Bhagavanth Kesari : మూడున్నర కోట్లతో ‘దంచవే మేనత్త కూతురా’ సాంగ్ షూట్.. కానీ సినిమా నుంచి డిలీట్..!
కాగా ఈ సినిమా తమిళ్ హిట్ మూవీ ‘మండేలా’కి రీమేక్ తెరకెక్కుతుంది. 2021లో కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రతో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా రెండు నేషనల్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని పూజా కొల్లూరు తెలుగులో డైరెక్ట్ చేస్తున్నాడు. నరేష్, డైరెక్టర్ వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్.. ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్మరన్ సాయి సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 27న ఈ మూవీని రిలీజ్ చేస్తామంటూ కూడా మేకర్స్ ప్రకటించారు.