Bhagavanth Kesari : మూడున్నర కోట్లతో ‘దంచవే మేనత్త కూతురా’ సాంగ్ షూట్.. కానీ సినిమా నుంచి డిలీట్..!
దాదాపు మూడున్నర కోట్లు ఖర్చు చేసి భగవంత్ కేసరి సినిమాలో షూట్ చేసిన 'దంచవే మేనత్త కూతురా' సాంగ్‌ని..

danchave menatha kuthura song removed from Balakrishna Bhagavanth Kesari
Bhagavanth Kesari : అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘భగవంత్ కేసరి’. రేపు అక్టోబర్ 18న రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే అవి కూడా జస్ట్ శాంపిల్ మాత్రమే, సినిమాలో థ్రిల్ ఫీల్ అయ్యే సీన్స్ చాలా ఉన్నాయంటూ బాలయ్య, అనిల్ రావిపూడి చెప్పుకొస్తున్నారు.
కాగా ఈ మూవీలో బాలయ్య సూపర్ హిట్ సాంగ్ ‘దంచవే మేనత్త కూతురా’ని రీమేక్ చేస్తున్నారని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తుంది. సినిమాలో ఈ పాట కోసం దాదాపు మూడున్నర కోట్లు ఖర్చు చేశారంట. అయితే ఆ సాంగ్ ని ఇప్పుడు మూవీ నుంచి డిలీట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అసలు ఏది నిజం..? ఏది అబద్దం..? తెలియని పరిస్థితిలో అభిమానులు ఉన్నారు. కాగా పరిశ్రమలోని కొందరు చెబుతున్న మాట ఏంటంటే.. ఈ పాటని సినిమా నుంచి తొలిగించలేదంట. ఫస్ట్ వీక్ పూర్తీ అయిన తరువాత యాడ్ చేయడానికి మేకర్స్ సిద్దమయ్యారంట.
Also read : Allu Arjun : నేషనల్ అవార్డుతో ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్.. గ్రాండ్ వెల్కమ్ పలికిన ఫ్యాన్స్..
ఇక ఈ సాంగ్ రీమేక్ అయితే కాదని చెబుతున్నారు. ఓల్డ్ సాంగ్ నుంచి కేవలం ‘దంచవే మేనత్త కూతురా’ అనే వోకల్స్ ని మాత్రమే తీసుకున్నారని చెబుతున్నారు. మరి సినిమాలో ఈ పాట ఎలా ఉండబోతుందో చూడాలి. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చి థమన్ నందమూరి అభిమానులను ఫుల్ ఖుషి చేశాడు. ఇప్పుడు భగవంత్ కేసరితో కూడా అభిమానులకు అదే హైని ఇచ్చేలా మ్యూజిక్ ని చేసినట్లు చెబుతున్నారు.