Sampoornesh Babu : ఇకపై హీరోగా సినిమాలు చేయను.. సంపూర్ణేష్ బాబు కామెంట్స్ వైరల్..
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంపూర్ణేష్ బాబు నేడు మీడియాతో మాట్లాడారు. (Sampoornesh Babu)
Sampoornesh Babu
Sampoornesh Babu : హృదయకాలేయం, సింగం 123, కొబ్బరిమట్ట.. లాంటి పలు కామెడీ సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంపూర్ణేష్ బాబు. పలు సినిమాల్లో కామెడీ గెస్ట్ రోల్స్ కూడా చేసాడు. అయితే ఇన్నాళ్లు కామెడీ సినిమాలు చేసిన సంపూర్ణేష్ బాబు ఇప్పుడు నాని ది ప్యారడైజ్ సినిమాలో చాలా సీరియస్ రోల్ చేస్తున్నాడు.
ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు బిర్యానీ అనే పాత్ర చేస్తున్నాడు అని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ది ప్యారడైజ్ సినిమా సెప్టెంబర్ 24న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంపూర్ణేష్ బాబు నేడు మీడియాతో మాట్లాడారు.
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాది చాలా సీరియస్ రోల్. చివర్లో కొంత ఎమోషన్ కూడా ఉంటుంది. నాని పక్కనే ఉంటాను సినిమా అంతా. నానికి క్లోజ్ ఫ్రెండ్ పాత్ర. నాకు కూడా యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి. ఈ పాత్ర చేయడానికి చాలా కష్టపడ్డాను. అసలు ఇందులో కామెడీ ఉండదు. ఈ సినిమా తర్వాత కొత్త సంపూర్ణేష్ బాబుని చూస్తారు. నాకు వచ్చే పాత్రలు కూడా అలాంటివే వస్తాయని, దర్శకులు నా కోసం పాత్రలు రాస్తారని అనుకుంటున్నాను అని తెలిపారు.
అలాగే.. ఈ సినిమా తర్వాత హీరోగా సినిమాలు చేయను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే సినిమాలు చేస్తాను. కొత్త క్యారెక్టర్స్, డిఫరెంట్ పాత్రలు అయితేనే చేస్తాను. అంతకుముందు చేసినట్టు కొన్ని తప్పులు చేయను. ఒకవేళ హీరోగా చేస్తే అది చాలా స్పెషల్ గా ఉండాలి. అలా అయితేనే హీరోగా చేస్తాను. రొటీన్ కామెడీ హీరోగా సినిమాలు చేయను అని తెలిపాడు. దీంతో సంపూర్ణేష్ బాబు నుంచి ఇకపై కామెడీ సినిమాలు రావనే తెలుస్తుంది.
Also See : Jabardasth Pavithra : వినాయకచవితి స్పెషల్.. ట్రెడిషినల్ లుక్స్ లో జబర్దస్త్ పవిత్ర..
