Spirit : ప్రభాస్ ‘స్పిరిట్‌’ స్టోరీ ఎలా ఉంటుందో చెప్పిన సందీప్ వంగ.. మొదటిరోజే 150 కోట్లు వస్తాయంట..

రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రభాస్ 'స్పిరిట్‌' స్టోరీ ఎలా ఉంటుందో చెప్పిన సందీప్ వంగ. మొదటిరోజే 150 కోట్లు వస్తాయంటూ చెప్పుకొచ్చిన దర్శకుడు.

Sandeep Reddy Vanga comments about Prabhas Spirit movie story

Spirit : ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున ప్రాజెక్ట్ ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషిస్తున్నారు. యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో హీరోల పాత్రలా.. స్పిరిట్ లో కూడా ప్రభాస్ ని చూసేందుకు క్యూరియాసిటీతో ఉన్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించిన ఆసక్తికర విషయాలను సందీప్ వంగ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేసారు. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుతూ.. “ప్రభాస్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. అలాంటి ఆఫీసర్ జాబ్ లో, తనకి దగ్గర వ్యక్తి విషయంలో ఒక తప్పు జరుగుతుంది. ఆ తరువాత ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా రియాక్ట్ అయ్యాడు” అనేది కథని చెప్పుకొచ్చారు.

Also read : Kannappa : ‘కన్నప్ప’లో మరో బాలీవుడ్ స్టార్ హీరో.. ఇంకెంతమందిని తీసుకొస్తాడో మంచు విష్ణు..

మూవీ స్క్రిప్ట్ ఆల్మోస్ట్ 60 శాతం పూర్తి అయ్యిందని చెప్పుకొచ్చారు. డిసెంబర్ నాటికీ స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసి.. షూటింగ్ కి తీసుకు వెళ్తామని పేర్కొన్నారు. ఇక ఈ మూవీ 300 కోట్ల బడ్జెట్ ని పెడుతున్నట్లు వెల్లడించారు. ట్రైలర్ అండ్ టీజర్ అనుకున్నట్లు ఆడియన్స్ కి రీచ్ అయితే.. ప్రభాస్ ఇమేజ్ కి మొదటిరోజే 150 కోట్లు వచ్చేస్తాయని సందీప్ వంగ తన ధీమాని వ్యక్తం చేశారు.

ఇక ఈ కామెంట్స్ తో ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. కాగా ఈ సినిమా స్క్రిప్ట్ ని యానిమల్ కంటే ముందే ప్రభాస్ కి వినిపించారట. కరోనా సమయంలో ప్రభాస్ కి ఈ స్టోరీ లైన్ చెప్పగా.. ఆయనకి బాగా నచ్చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.