Sandeep Reddy Vanga : రణబాలి సినిమాపై సందీప్ రెడ్డి వంగ రివ్యూ.. నెక్స్ట్ యాక్షన్ హీరో నువ్వే అంటూ..
తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రణబాలి సినిమా చూసి తన సోషల్ మీడియాలో స్పందించాడు. (Sandeep Reddy Vanga)
- Saketh U
- Updated on- October 17, 2026 / 03:40 PM IST
Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా వచ్చిన రణబాలి సినిమా థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. 1870 ల కాలంలో రాయలసీమలో వచ్చిన కరువు, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన ధాన్యాన్ని దోచుకుపోయిన తీరుని, దాన్ని ఎదిరించిన ఓ వీరుడి కథగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రశంసలు వస్తుండగా తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రణబాలి సినిమా చూసి తన సోషల్ మీడియాలో స్పందించాడు.
Also Read : Rashmika Mandanna : రణబాలి వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన రష్మిక మందన్న.. ఫొటోలు..
సందీప్ రెడ్డి వంగ తన ట్వీట్ లో.. రణబాలి సినిమా చూడండి. ఆ పాత్రలో విజయ్ దేవరకొండ గొప్పగా ఒదిగిపోయారు. విజయ్, రష్మిక జోడీ వారిద్దరిది కెమిస్ట్రీకి మించిన బంధం. కొన్ని బంధాలు సినిమాని మించి ఉంటాయి. జయమ్మగా తన పాత్రకు రష్మిక ప్రాణం పోసింది. చరిత్రను పరిశీలించిన తీరు, దాన్ని తెరకెక్కించిన విధానంలో రాహుల్ సంకృత్యాన్ శ్రద్ధ సినిమాలో స్పష్టంగా కనిపిస్తోంది. చరిత్రలో భాగంగా మన పాఠ్యపుస్తకాల్లో చేర్చదగిన కథ ఇది. చరిత్రలో మరుగున పడిన ఒక ఘట్టాన్ని ఈ సినిమాతో మన ముందుకు తీసుకొచ్చారు. విజయ్… నీ యాక్షన్ సన్నివేశాల్లో ఒక సహజమైన, అదుపులేని ఉగ్రత కనిపిస్తుంది. దీన్ని ఎవరూ కృత్రిమంగా సృష్టించలేరు. నువ్వు పోరాడే తీరులో ఒక భయంకరమైన తీవ్రత ఉంది. భారతీయ సినిమా రంగంలో తర్వాత యాక్షన్ హీరో నువ్వే అవుతావని నేను బలంగా నమ్ముతున్నాను అంటూ పోస్ట్ చేసాడు.
దీనికి రష్మిక స్పందిస్తూ.. వంగ సర్, థ్యాంక్యూ సో మచ్ అని తెలిపింది. విజయ్ కూడా రిప్లై ఇస్తూ.. వంగా.. నువ్వు సినిమా చూసి రివ్యూ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మన కాంబోలో వచ్చిన అర్జున్ రెడ్డి ప్రీమియర్స్ పడిన తర్వాత నువ్వు నన్ను ఆప్యాయంగా హత్తుకుని ప్రశంసించిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇది అలాగే అనిపిస్తుంది. మరో 10 సంవత్సరాల తర్వాత కూడా మీకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని నాకు తెలుసు. కానీ ఈ ట్వీట్ చూడటం నాకు కిక్ ఇస్తుంది అని తెలిపారు.
