Anirudh-Kavya Maran Wedding: ‘కావ్య మారన్- అనిరుద్’ పెళ్లి ఫిక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న ఇద్దరి ఆస్తుల వివరాలు.. ఎన్ని వందలకోట్లో తెలుసా?
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్, కావ్య మారన్ (Anirudh-Kavya Maran Wedding)త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త ట్రెండ్ అవుతోంది.
Anirudh Ravichander and Kavya Maran net worth news viral on social media
Anirudh-Kavya Maran Wedding: సంగీత ప్రపంచంలో వరుస చార్ట్‌బస్టర్ హిట్స్‌తో దూసుకుపోతున్న యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్, ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యజమాని కావ్య మారన్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త నేషనల్ వైడ్‌గా విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే పెళ్లి ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధమై పరిమిత సంఖ్యలో సన్నిహితులకు వెళ్తున్నాయనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి లైఫ్‌స్టైల్, వ్యాపార సామ్రాజ్యం, ఆస్తుల వివరాలపై నెటిజన్లు తీవ్ర ఆసక్తి చూపుతున్నారు.
కోట్ల రూపాయల రాయల్టీలు.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ ఆస్తులు:
భారతీయ చిత్రసీమలో అత్యధిక పారితోషికం తీసుకునే సంగీత దర్శకుల్లో అనిరుద్ (Anirudh-Kavya Maran Wedding)ఒకరు. ప్రతి సినిమాకు దాదాపు రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకు పారితోషికం అందుకనే ఈ రాక్‌స్టార్, లైవ్ కాన్సర్ట్‌లు, బ్రాండ్ ఎండోర్స్మెంట్ల ద్వారా భారీగా ఆర్జిస్తున్నారు. నివేదికల ప్రకారం అనిరుద్ నికర ఆస్తుల విలువ (Net Worth) సుమారు రూ. 60 కోట్ల నుంచి రూ. 80 కోట్ల వరకు ఉంటుందని అంచనా. చెన్నైలోని ఖరీదైన పోష్ ఏరియాలో విలాసవంతమైన భవనంతో పాటు రోల్స్ రాయిస్, బిఎమ్‌డబ్ల్యూ వంటి లగ్జరీ కార్ల కలెక్షన్ కూడా ఆయన వద్ద ఉంది.
సన్ గ్రూప్ సామ్రాజ్యం.. మిలియన్ డాలర్ల అధినేత్రి కావ్య మారన్ ఆస్తుల లెక్కలు:
మరోవైపు సన్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య మారన్ బిజినెస్ వరల్డ్‌లో తనదైన ముద్ర వేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జెట్టుతో పాటు సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్‌లోని సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్‌లను కూడా ఆమె విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కావ్య మారన్ వ్యక్తిగత నికర ఆస్తుల విలువ సుమారు రూ. 400 కోట్ల పైమాటే అని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆమె కుటుంబానికి చెందిన సన్ గ్రూప్ మొత్తం వ్యాపార సామ్రాజ్యం విలువ వేల కోట్లలో ఉండటంతో ఆమె అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో ఒకరిగా నిలిచారు.
Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వరుసగా 4 రోజులు సెలవులు.. అధికారిక ఉత్తర్వులు జారీ
ఎవరిది పైచేయి? లగ్జరీ లైఫ్‌లో ఇద్దరి ప్రయాణం:
ఆస్తుల పరంగా పోల్చి చూస్తే కళానిధి మారన్ వ్యాపార వారసురాలైన కావ్య మారన్ ఆస్తుల విలువ అనిరుద్ కంటే చాలా రెట్లు ఎక్కువ. అయినప్పటికీ, సినీ పరిశ్రమలో తన స్వయంకృషితో అనిరుద్ సాధించిన ఆర్థిక ఎదుగుదల, స్టార్డమ్ కూడా తక్కువేమీ కాదు. ఒకవైపు పవర్ ఫుల్ బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్, మరోవైపు మ్యూజిక్ వండర్‌గా వెలుగొందుతున్న పాపులారిటీ కలవడంతో ఈ జోడీ గ్రాండ్ వెడ్డింగ్, లగ్జరీ లైఫ్‌స్టైల్ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యంత ఆసక్తికరమైన టాపిక్‌గా మారాయి.
