Sundeep Kishan : ఆ సినిమాని సందీప్ కిషన్‌తో చేయడానికి.. సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేశాడట..

సందీప్ రెడ్డి వంగ ఆ సినిమాని సందీప్ కిషన్‌తో చేయడానికి ప్లాన్ చేశాడట. కానీ..

Sandeep Reddy Vanga is primarily planning that project with Sundeep Kishan

Sundeep Kishan : టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ రీసెంట్ గా ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఫాంటసీ థ్రిల్లర్ నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న సందీప్ కిషన్ పలు ఆసక్తికర విషయాలను ఆడియన్స్ తో పంచుకుంటున్నారు. ఈక్రమంలోనే సందీప్ రెడ్డి వంగతో చేయాల్సిన ఓ సినిమా గురించి చెప్పుకొచ్చారు.

‘అర్జున్ రెడ్డి’ మూవీకి ముందు సందీప్ రెడ్డి వంగ ‘షుగర్ ఫ్యాక్టరీ’ అనే స్క్రిప్ట్ ని రాసుకున్నారు. ఆ ప్రాజెక్ట్ ని సందీప్ కిషన్ చేయాలని భావించారట. ఇక ఈ సినిమా కోసం వంగ అండ్ సందీప్ కిషన్ కలిసి దాదాపు ఏడాది పాటు ట్రావెల్ చేశారంట. అయితే నిర్మాణ కారణాలు వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళలేదు. ఆ తరువాత సందీప్ వంగ.. అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ ని స్టార్ట్ చేసి విజయ్ దేవరకొండతో తెరకెక్కించారు.

Also read : Mahesh Babu : ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లలో మహేష్ బాబు వాయిస్.. బిల్ పేమెంట్ చేస్తే..

ఒకవేళ సందీప్ వంగతో సందీప్ కిషన్ మూవీ పడుంటే.. కెరీర్ మరో రేంజ్ లో ఉండేది. అయితే సందీప్ కిషన్ ఈ స్టార్ డైరెక్టర్ ని మాత్రమే కాదు, మరికొంతమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ని కూడా మిస్ చేసుకుంటూ.. వారిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ దర్శకుల్లో ఒకరు ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ వర్మ దండు. ఈ డైరెక్టర్ తో కూడా సందీప్ చాలా కాలం ట్రావెల్ చేశారట. కానీ, సినిమా మాత్రం చేయలేదు.

ఇక గత ఏడాది శ్రీవిష్ణుతో ‘సామజవరగమన’ సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రామ్ అబ్బరాజు.. సందీప్ కిషన్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారట. సామజవరగమన తెరకెక్కించడం కోసం రామ్ అబ్బరాజుని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థకి పంపించడం, అలాగే నిర్మాణంలో తాను కూడా డబ్బులు పెట్టడం కూడా చేశారట సందీప్ కిషన్. ఇక చివరిగా లోకేష్ కానగరాజ్ విషయానికి వస్తే.. ‘నగరం’ సినిమాతో ఈ దర్శకుడిని పరిచయం చేసింది సందీప్ కిషనే. కానీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఛాన్స్ వస్తే మాత్రం మిస్ చేసుకున్నారట.

 

ట్రెండింగ్ వార్తలు