Mahesh Babu : ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లలో మహేష్ బాబు వాయిస్.. బిల్ పేమెంట్ చేస్తే..
ఇకనుంచి ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లలో మీ నగదు లావాదేవీలు అన్ని మహేష్ బాబు వాయిస్ తో వినిపించనున్నాయి.

Phone Pe transactions with Mahesh Babu Voice in Smart speakers
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు కంటే కమర్షియల్స్ ప్రమోషన్స్ అండ్ యాడ్స్ తోనే ఎక్కువ సంపాదిస్తుంటారు. అయితే ఆ సంపాదనని తన కోసం కాకుండా పేదలు కోసం, చిన్న పిల్లల చికిత్సల కోసం ఉపయోగిస్తుంటారు. ఇప్పటికే మహేష్ పాతికకు పైగా బ్రాండ్స్ కి అంబాసడర్ గా చేస్తూ వస్తున్నారు. తాజాగా మరో సంస్థకి అంబాసడర్‌గా మారుతూ.. తన గొంతుని అరువు ఇచ్చేస్తున్నారు.
ప్రముఖ మనీ ట్రాన్స్ఫర్ యాప్ ఫోన్‌పే (Phone Pe) స్మార్ట్ స్పీకర్లకు మహేష్ తన గొంతుని అరువు ఇస్తున్నారు. ఫోన్ పే నుంచి మనీ సెండ్ చేసినప్పుడు.. మనీ రీసివ్డ్ అంటూ కంప్యూటర్ జెనెరేటెడ్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ వాయిస్ కి బదులు మహేష్ బాబు వాయిస్ వినిపించబోతుంది. ఇందుకోసం మహేష్ వాయిస్ తో కొన్ని శాంపిల్స్ తీసుకోని AIతో వాయిస్ ని జెనెరేట్ చేశారు.
Also read : Actor Vishal : త్రిషకు అండగా హీరో విశాల్.. ఆ పొలిటికల్ లీడర్‌కు దిమ్మతిరిగేలా గట్టి కౌంటర్!
ఇక నుంచి కొత్త ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లలో మీ నగదు లావాదేవీలు మహేష్ బాబు వాయిస్ తో వినవచ్చు. కాగా ఇప్పటికే అమితాబ్ బచ్చన్ వాయిస్ తో కూడా ఫోన్‌పే లావాదేవీలు వినిపిస్తూ మార్కెట్ లోకి వచ్చింది. అయితే అలా అమితాబ్ వాయిస్ వినిపించినందుకు కొంత డబ్బుని ఛార్జి లెక్క జమ చేసుకుంటున్నట్లు కొందరు వ్యాపారాలు చెబుతున్నారు. మరి ఇప్పుడు మహేష్ వాయిస్ కూడా అలాగే ఛార్జి చేస్తారా లేదా అనేది చూడాలి.
@SrBachchan voice vastundhi Ani 15rs charge chystunaru ippudu @urstrulyMahesh voice ki antha @PhonePe tisukuntaroo ?♂️?♂️
Merchant ki money waste ?♂️?♂️
— ᴊᴀɢᴀᴅᴇᴇꜱʜ ᴠɪɴᴜᴋᴏᴛɪ ? (@jagadeesh_jsp1) February 20, 2024
కాగా మహేష్ సినిమాలు విషయానికి వస్తే.. రాజమౌళితో తెరకెక్కించబోతున్న SSMB29 ఈ మే నెలలో సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ అనే ఇండోనేషియన్ భామ మహేష్ సరసన నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. సినిమాటోగ్రాఫర్ గా PS వినోద్, సంగీత దర్శకుడిగా MM కీరవాణి, ఎడిటర్ గా తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్ గా మోహన్ నాథ్ బింగి, VFX సూపర్ వైజర్ గా కమల్ కన్నన్ లు పనిచేయబోతున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ గా రమా రాజమౌళి, ఆమె టీం వర్క్ చేయబోతున్నారు.