Actor Vishal : త్రిషకు అండగా హీరో విశాల్.. ఆ పొలిటికల్ లీడర్‌కు దిమ్మతిరిగేలా గట్టి కౌంటర్!

Actor Vishal Comments : స్టార్ హీరోయిన్ త్రిషకు హీరో విశాల్ అండగా నిలిచాడు. తమిళనాడుకు చెందిన పొలిటికల్ లీడర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు తనదైన శైలిలో విశాల్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.

Actor Vishal : త్రిషకు అండగా హీరో విశాల్.. ఆ పొలిటికల్ లీడర్‌కు దిమ్మతిరిగేలా గట్టి కౌంటర్!

Tamil Actor Vishal slams politician derogatory comments against Actress Trisha

Updated On : February 20, 2024 / 11:26 PM IST

Actor Vishal Comments : తమిళనాడులో ఓ రాజకీయ పార్టీకి చెందిన పొలిటిషియన్ స్టార్ హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కోలివుడ్‌లో తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ విషయంలో త్రిష కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలబ్రిటీల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ అటెన్షన్ కోసం ఎంతకైనా దిగజారుతారని ఆమె మండిపడ్డారు. దీనిపై తన లీగల్ టీమ్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని త్రిష ట్వీట్ చేసింది.

Read Also : Kushitha Kallapu : ‘గుంటూరు కారం’లో నేను నటించాను.. కానీ ఆ తరువాత.. కుషిత కామెంట్స్..

త్రిషకు సపోర్టు చేస్తూ ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు కూడా ఏవీ రాజు అనే లీడర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారడంతో పలువురు సినీతారలు సైతం త్రిషకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా త్రిషకు అండగా హీరో విశాల్ నిలిచాడు. తన ట్విట్టర్ (X) వేదికగా పొలిటిషియన్ వ్యాఖ్యలకు తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చాడు.

‘ఓ రాజకీయ పార్టీకి చెందిన మూర్ఖుడు ఒకరు.. మన సినీవర్గానికి చెందిన ఒక వ్యక్తి గురించి అత్యంత దారుణంగా అసహ్యంగా మాట్లాడటం గురించి నేను విన్నాను. మీరు ఇదంతా పబ్లిసిటీ కోసమే చేశారనే విషయం నాకు తెలుసు.. అందుకే మీ పేరు గానీ టార్గెట్ చేసిన వ్యక్తి పేరును గానీ నేను ప్రస్తావించను.

నేను ఖచ్చితంగా పేర్లను ప్రస్తావించను. ఎందుకంటే మేము మంచి స్నేహితులమే కాదు.. సినిమాల్లో సహ కళాకారులం కూడా. మీ ఇంట్లో ఉన్న స్త్రీలు మీరు చేసిన పని తర్వాత ఇంటికి క్షేమంగా తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. అవును.. భూమిపై ఉన్న అలాంటి రాక్షసుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధ కలిగించింది. మీరు చేసింది ఎంత చెత్తగా ఉందో మాట్లాడానికి నాకే అసహ్యం వేస్తోంది.

నిజాయితీగా చెప్పాలంటే.. మీరు చేసిన చెత్త వ్యాఖ్యలను ఖండించడం కూడా నాకు ఇష్టం లేదు. మీరు నరకంలో కుళ్ళిపోతారని నేను ఆశిస్తున్నాను. మరోసారి కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఈ ప్రకటన చేయాలనే ఉద్దేశ్యం లేదు. కానీ మానవుడిగా, మీరు భూమిపై ఉన్నంత వరకు మీరు ఎప్పటికీ మనిషిలా ఉండలేరు. అయితే, సెలబ్రిటీల గురించి నెగిటివ్ ప్రచారం చేసి డబ్బు సంపాదించడం ట్రెండ్‌గా మారింది. చేతనైతే మంచి ఉద్యోగం సంపాదించండి. కనీసం ప్రాథమిక క్రమశిక్షణ అయినా నేర్చుకోవడానికి మీరు బిచ్చగాడిగా జీవితాన్ని ప్రారంభించండి’ అంటూ విశాల్ ఘాటుగా స్పందించాడు.

Read Also : Trisha : త్రిషపై పొలిటికల్ లీడర్ చీప్ కామెంట్స్.. లీగల్‌గా చూసుకుంటా అంటున్న హీరోయిన్..