Kushitha Kallapu : ‘గుంటూరు కారం’లో నేను నటించాను.. కానీ ఆ తరువాత.. కుషిత కామెంట్స్..

'గుంటూరు కారం'లో నేను నటించాను అంటూ కుషిత. కానీ ఆ తరువాత..

Kushitha Kallapu : ‘గుంటూరు కారం’లో నేను నటించాను.. కానీ ఆ తరువాత.. కుషిత కామెంట్స్..

Kushitha Kallapu comments about her role in Mahesh Babu Guntur Kaaram

Updated On : February 20, 2024 / 8:59 PM IST

Kushitha Kallapu : తెలుగు అమ్మాయి కుషిత కల్లపు.. సోషల్ మీడియా ద్వారా ఫేమ్ ని సంపాదించుకొని ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని అందుకుంది. ఆ తరువాత పలు సినిమాల్లో కూడా నటించింది. ఇక ఆ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’లో కూడా ఛాన్స్ అందుకున్నట్లు వార్త వచ్చింది. న్యూస్ మాత్రమే కాదు, కుషిత కూడా.. ఒక ఫోటో షేర్ చేస్తూ గుంటూరు కారం సెట్స్ అంటూ పోస్టు చేసింది.

ఇక ఆ పోస్టుతో ఆమె గుంటూరు కారం సినిమాలో నటిస్తుందని భావించారు. కానీ ఇటీవల రిలీజైన ఆ చిత్రంలో అసలు కుషిత కనిపించలేదు. దీంతో కుషిత తన పోస్టుతో అందర్నీ ఫూల్ చేసిందని భావించారు. ఇక ఈ విషయం గురించి కుషిత రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ భామ నటిస్తున్న కొత్త సినిమా ‘బాబు నెంబర్ వన్ బుల్‌షిట్ గాయ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ విలేకర్ల సమక్షంలో జరిగింది.

Also read : Nandamuri Balakrishna : సినిమాలకు బ్రేక్ ఇచ్చేస్తున్న బాలకృష్ణ.. ఇక పై రాజకీయాల్లోనే..

ఈ కార్యక్రమంలో కుషిత కూడా పాల్గొనగా ఆమెను గుంటూరు కారం గురించి ప్రశించారు. కుషిత బదులిస్తూ.. “నేను సినిమాలో నటించాను. నాతో నాలుగు రోజులు షూటింగ్ చేసారు. కానీ సినిమా రిలీజైన తరువాత నా సీన్స్ కనిపించకపోవడంతో షాక్ అయ్యాను. మూవీ టీంని అడిగాను కూడా. వాళ్ళు చెప్పిందేంటంటే, నాతో పాటు యాక్ట్ చేసినవారిది కూడా తీసేసినట్లు చెప్పుకొచ్చారు. మొదటి చాలా బాధ పడ్డాను. కానీ సినీ పరిశ్రమలో ఇలా జరగడం చాలా కామన్ అని రిలాక్స్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఇదే ఈవెంట్ లో బేబీ మూవీ నిర్మాత SKN మాట్లాడుతూ.. “కుషితని ఒక ఏడాది పాటు ఏ సినిమా చేయొద్దు. వైష్ణవిలా నిన్ను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పాను. కానీ ఆమె మాత్రం ఈ వన్ ఇయర్ లో నాలుగైదు సినిమాలు చేసేయాలని చెప్పింది. నీ నిర్ణయానికి ఆల్ ది బెస్ట్” అంటూ తెలియజేసారు.