Nandamuri Balakrishna : సినిమాలకు బ్రేక్ ఇచ్చేస్తున్న బాలకృష్ణ.. ఇక పై రాజకీయాల్లోనే..

సినిమాలకు బ్రేక్ ఇచ్చేస్తున్న బాలకృష్ణ. ఇక పై ఫుల్ ఫోకస్ ని రాజకీయాలు పైనే..

Nandamuri Balakrishna : సినిమాలకు బ్రేక్ ఇచ్చేస్తున్న బాలకృష్ణ.. ఇక పై రాజకీయాల్లోనే..

Nandamuri Balakrishna is getting ready to call break for movies

Updated On : February 20, 2024 / 8:37 PM IST

Nandamuri Balakrishna : నటసింహ బాలకృష్ణ ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే, మరోపక్క ఎమ్మెల్యేగా ప్రజాపరిపాలన కూడా నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఇన్నాళ్లు రెండు పడవలు మీద ప్రయాణించిన బాలకృష్ణ.. ఇప్పుడు సినిమా అనే పడవని పక్కన పెట్టడానికి సిద్దమవుతున్నారట. మరో రెండు నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో ఏపీలో ఎన్నికలు హీట్ కనిపిస్తుంది.

ప్రతి పార్టీ వారు ఈ ఎన్నికల్లో గెలుపుని సొంతం చేసుకోవడం కోసం.. తెగ కష్టపడుతున్నారు. దీంతో అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కనిపిస్తుంది. ఇక ఈ పోటీని ఎదుర్కొనేందుకు బాలకృష్ణ.. కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఎలక్షన్స్ పై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట. ఈక్రమంలోనే ఈ రెండు నెలలు సినిమాలకు బ్రేక్ ఇచ్చేస్తున్నారని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాలకు బ్రేక్ ఇచ్చేసారు.

Also read : Trisha : త్రిషపై పొలిటికల్ లీడర్ చీప్ కామెంట్స్.. లీగల్‌గా చూసుకుంటా అంటున్న హీరోయిన్..

ఇక ఈ నిర్ణయంతో NBK109 షూటింగ్ కి బ్రేక్ లు పడబోతున్నట్లు తెలుస్తుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. 1980’s బ్యాక్‌డ్రాప్ తో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మూవీలో బాలయ్య నుంచి ఇప్పటివరకు చూడాలని వయోలెన్స్ ఆడియన్స్ చూడబోతున్నట్లు చెబుతున్నారు. దీంతో బాలయ్య అభిమానులలో ఈ మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి.

గత ఏడాదే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం.. దాదాపు 20 రోజులు పాటు ఊటీలో ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఆ తరువాత షెడ్యూల్ ని రాజస్థాన్ లో ప్లాన్ చేసారు. అక్కడ కూడా ఒక అదిరిపోయే యాక్షన్ షెడ్యూల్ ని తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. సినిమాలో అయితే వేరే లెవెల్ లో ఉంటుందని బాబీ ఫ్యాన్స్ కి హామీ ఇస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేస్తున్నారు.