Sandeep Reddy Vanga: జస్ట్ ఎమోజీ షేర్ చేశాడు అంతే.. సోషల్ మీడియా షేక్ అయ్యింది.. సందీప్ రెడ్డి మామూలోడు కాదు!

సందీప్ రెడ్డి వంగ.. ప్రెజెంట్ ఈ పేరుకున్న క్రేజ్ నెక్స్ట్ లెవల్. (Sandeep Reddy Vanga)దర్శకుడుగా చెప్పాలంటే చేసింది రెండు సినిమాలే కానీ, ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్.

Sandeep Reddy Vanga reacts to Deepika's removal from Kalki 2

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగ.. ప్రెజెంట్ ఈ పేరుకున్న క్రేజ్ నెక్స్ట్ లెవల్. దర్శకుడుగా చెప్పాలంటే చేసింది రెండు సినిమాలే కానీ, ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్. రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తినే తన వర్క్ తో మెప్పించాడంటే అది మాములు విషయం కాదు. ఎందుకంటే, సందీప్ వే ఆఫ్ వర్కింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆలోచన విధానం కూడా కొత్తగా ఉంటుంది. ఏదున్నా మొహంమీద(Sandeep Reddy Vanga) చెప్పేయడం ఆయన అలవాటూ. ఆ క్వాలిటీనే ఆయన్ని మిగతా వారికంటే ప్రత్యేకంగా నిలిచేలా చేసింది.

Manchu Manoj: మిరాయ్ 2 కథ ఇదే.. బ్లాక్ స్వార్డ్ చనిపోలేదు.. మిరాయ్ లో సమాధానంలేని ప్రశ్నలు ఎన్నో: మంచు మనోజ్

తన వర్క్ కి సెట్ అవకపోతే ఎదురుగా ఉంది ఎంత పెద్ద వ్యక్తి అయినా పక్కన పెట్టేయడమే ఆయనకి తెలుసు. అదే బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకునే విషయం చేసి చూపించాడు సందీప్ రెడ్డి వంగ. ఆయన ప్రెజెంట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా కోసం ముందుగా దీపికా పదుకునేను తీసుకున్నాడు సందీప్. అయితే, ఈ సినిమా కాల్ షీట్స్ విషయంలో చాలా కండీషన్స్ పట్టిందట దీపికా. కేవలం రోజులో ప్రత్యేకమైన సమయం మాత్రమే షూటింగ్ కి కేటాయిస్తానని, ఎక్కువ సమయం అంటే ఇవ్వలేనని కండీషన్స్ పెట్టిందట. దాంతో, అసహనానికి గురైన సందీప్ ప్రాజెక్టు నుంచి ఆమెను తీసేసి ఆమె ప్లేస్ లో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని తీసుకున్నాడు. ఇటీవల ఈ న్యూస్ సంచలంగా మారింది.

అయితే, తాజాగా కల్కి 2 నుంచి కూడా దీపికా పదుకునేను తొలగిస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ చాలా సమయం పడుతుంది. కాబట్టి, టైం టూ టైం కాల్ షీట్స్ అంటే కాస్త కష్టం అవుతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అంటూ అధికారిక పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో, ఈ న్యూస్ కాస్తా ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అప్పుడు సందీప్, ఇప్పుడు నాగ్ అశ్విన్ అంటూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు వచ్చాయి. ఇదిలా ఉంటే, కల్కి 2 మేకర్స్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ కి రియాక్ట్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగ. ఆ పోస్టుకి నవ్వుతున్న ఆరు ఎమోజీ లను యాడ్ చేశాడు. ఇలా జరుగుతుంది అని తాను ముందే చెప్పినట్టుగా అర్థం వచ్చేలానే సందీప్ ఈ పోస్ట్ పెట్టాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా కేవలం కాల్ షీట్స్ కారణంగా రెండు పెద్ద సినిమాల నుండి దీపికను తీసేయడం అనేది హాట్ టాపిక్ గా మారింది.