Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్ ఎక్కడో చెప్పేసిన సందీప్ రెడ్డి వంగ.. వీడియో వైరల్..

తాజాగా నేడు ఉగాది సందర్భంగా సందీప్ రెడ్డి వంగ అమెరికాలోని ఓ తెలుగు అసోసియేషన్ ఉగాది ఈవెంట్లో పాల్గొన్నాడు.

Sandeep Reddy Vanga Revealed Prabhas Spirit Movie Shooting Location

Sandeep Reddy Vanga : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రస్తుతం చేతిలో అరడజను సినిమాలకు పైగా పెట్టుకొని బిజీగా ఉన్నాడు. పరిస్థితం రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు అయ్యాక ఈ సంవత్సరం చివర్లో స్పిరిట్ సినిమా మొదలు పెట్టనున్నాడు.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో టి సిరీస్ నిర్మాణంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసాఫీసర్ గా కనిపిస్తాడని సందీప్ గతంలోనే చెప్పాడు. సందీప్ తో సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లో మొదలవ్వొచ్చు అని ఇటీవల సందీప్ రెడ్డి తెలిపాడు.

Also Read : Roopa Koduvayur : మామిడికాయ కొరుకుతూ.. అందంతో.. అల్లరితో.. రూప కొడువాయూర్ ఉగాది ఫొటోలు..

తాజాగా నేడు ఉగాది సందర్భంగా సందీప్ రెడ్డి వంగ అమెరికాలోని ఓ తెలుగు అసోసియేషన్ ఉగాది ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్లో స్పిరిట్ గురించి అడగ్గా.. నేను మెక్సికోకి లొకేషన్స్ కోసం రెక్కీకి వచ్చాను. స్పిరిట్ సినిమా మెక్సికో లో షూట్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రస్తుతానికి స్పిరిట్ అప్డేట్ ఇదే అని తెలిపాడు.

దీంతో స్పిరిట్ సినిమా మెక్సికోలో షూటింగ్ అంటే సందీప్ ఏదో భారీగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సందీప్ రెడ్డి స్పిరిట్ గురించి మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.