Sandeep Reddy Vanga : చిరంజీవికి సందీప్ వంగ.. ఈ రేంజ్ అభిమానా.. 27ఏళ్ళ క్రిందటి షర్ట్ కలర్..

చిరంజీవికి సందీప్ వంగ అభిమాని అని తెలుసు గాని. మరీ ఈ రేంజ్ అభిమాని అని తెలియదు.

Sandeep Reddy Vanga show his fanism on Chiranjeevi to recall 27 years back movie

Sandeep Reddy Vanga : టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. రీసెంట్ గా ‘యానిమల్’ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీంతో సందీప్ వంగ తదుపరి చిత్రాలు పై మరింత ఆసక్తి మొదలైంది. కాగా సందీప్ వంగ.. చిరంజీవికి అభిమాని అందరికి తెలిసిందే. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో సందీప్ వంగ వెల్లడించారు.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి సందీప్ మాట్లాడిన మాటలు విన్న మెగా అభిమానులు.. ”చిరంజీవికి సందీప్ వంగ ఈ రేంజ్ అభిమానా” అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో సందీప్ వంగ ఏం మాట్లాడారంటే.. “చిరంజీవి గారి ఇన్‌ఫ్లుయెన్స్ నా మీద ఎప్పుడు ఉంటుంది. మాస్టర్ సినిమాలో హీరోయిన్ కి చిరంజీవి ‘నా గతం తెలుసా’ అని చెబుతున్న సీన్ ఉంటుంది. ఆ సీన్ లో చిరంజీవి గారు గ్రీన్ షర్ట్ వేసుకొని, సిగరెట్ తాగుతూ అగ్రీసివ్ గా డైలాగ్స్ చెబుతారు. ఆయన అలా సిగరెట్ తాగుతూ డైలాగ్ చెప్పిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది” అంటూ పేర్కొన్నారు.

Also read : Samyuktha Menon : వరుస హిట్స్‌తో ఫామ్ ఉన్న హీరోయిన్ పెళ్లి చేసుకుంటోందా?

27ఏళ్ళ క్రిందట వచ్చిన సినిమాలోని షర్ట్ కలర్ కూడా ఇంకా గుర్తుపెట్టుకున్న సందీప్ వంగని చూసి.. చిరు అభిమానులు ఫిదా అవుతున్నారు. చిరంజీవికి సందీప్ వంగ మరీ ఈ రేంజ్ అభిమానా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా చిరంజీవితో సినిమా చేసే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాను అని సందీప్ వంగ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దీంతో మెగా అభిమానులు చిరంజీవికి సందీప్ తో సినిమా చేయమని రిక్వెస్ట్ లు పెడుతున్నారు.

కాగా చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠతో తన 156 సినిమాని తెరకెక్కిస్తున్నారు. సోషియో ఫాంటసీ డ్రామాతో ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ చేసుకున్న ఈ మూవీ సెట్స్ లోకి చిరంజీవి సంక్రాంతి తరువాత నుంచి పాల్గొనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఎక్కువ భాగం గ్రాఫిక్స్ పై తెరకెక్కనుంది.