Samyuktha Menon : వరుస హిట్స్‌తో ఫామ్ ఉన్న హీరోయిన్ పెళ్లి చేసుకుంటోందా?
వరుస సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్న నటి ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెరియర్ మంచి పీక్‌లో ఉన్న టైమ్‌లో పెళ్లి నిర్ణయం తీసుకున్న ఆ నటి ఎవరు?

Samyuktha Menon
Samyuktha Menon : భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చి విరూపాక్షలో అదరగొట్టిన నటి సంయుక్త మీనన్ వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. ఇటీవల కాస్త ఈ నటి స్పీడు తగ్గించారు. అందుకు కారణం ఈ ఏడాది తన బాయ్ ఫ్రెండ్ ని సంయుక్త పెళ్లాడనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Kajal Aggarwal : ఫ్యామిలీతో కాజల్ అగర్వాల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..
2016 లో ‘పాప్ కార్న్’ అనే మళయాళ సినిమాతో తెరపై ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ తమిళ, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించారు. 2018 లో ‘కలరి’ అనే సినిమాతో తమిళనాట అడుగుపెట్టారు. తెలుగులో మొదటగా హీరో కళ్యాణ్ రామ్ సినిమా బింబిసారలో నటించారు. అయితే ముందుగా 2022 లో భీమ్లా నాయక్ రిలీజైంది. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు సంయుక్త. అదే సంవత్సరం తెలుగు, తమిళంలో వచ్చిన సార్ సూపర్ హిట్ అయ్యింది. ఇక 2023 లో విరూపాక్ష సినిమాలో నందిని అనే నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో సంయుక్త అదరగొట్టారు. కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ లో మెరిసారు. ఇదిలా ఉంటే ఇటీవల ఎందుకో సంయుక్త సినిమాలు చేయడంలో జోరు తగ్గించారు.
Bhumika Chawla : ఇటు సినిమాలు చేస్తూనే అటు వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఒకప్పటి స్టార్ హీరోయిన్
ఆ మధ్య సంయుక్త విడాకులు తీసుకున్న ఓ తమిళ హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే అదంతా రూమర్లుగా కొట్టిపారేశారు. తాజాగా సంయుక్త పెళ్లి వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే తన స్నేహితుడితో డేటింగ్ లో ఉన్న సంయుక్త అతనిని పెళ్లాడబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగబోతోందని సన్నిహితులు చెబుతున్నారు. ఈ వార్తలపై నిజమెంతో.. ఆ పెళ్లికొడుకు ఎవరో సంయుక్త వెల్లడించాల్సి ఉంది.