Bhumika Chawla : ఇటు సినిమాలు చేస్తూనే అటు వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఒకప్పటి స్టార్ హీరోయిన్

ఇటీవల కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు సినిమాలతో పాటు వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా నటి భూమికా చావ్లా కూడా బిజినెస్ రంగంలో కాలు మోపారు.

Bhumika Chawla : ఇటు సినిమాలు చేస్తూనే అటు వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఒకప్పటి స్టార్ హీరోయిన్

Bhumika Chawla

Updated On : January 2, 2024 / 1:16 PM IST

Bhumika Chawla : ఒకప్పుడు హీరోయిన్‌గా పాపులారిటీ సంపాదించుకున్ననటి భూమికా చావ్లా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే బిజినెస్ వైపు టర్న్ తీసుకున్నారు భూమిక. గోవాలో కొత్తగా హోటల్ ప్రారంభిస్తున్న ఫోటోలను భూమిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Shobha Shetty : పెళ్లికి ముందు ప్రియుడితో కలిసి.. బిగ్‌బాస్ శోభాశెట్టి ఏం ప్లాన్ చేస్తుందో తెలుసా?

2000 లో వచ్చిన ‘యువకుడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు నటి భూమిక. 2001 లో వచ్చిన ‘ఖుషీ’ భూమికకి సూపర్ హిట్ ఇచ్చింది. ఆ తర్వాత స్నేహమంటే ఇదేరా, వాసు, ఒక్కడు, మిస్సమ్మ, సింహాద్రి, నా ఆటోగ్రాఫ్, మాయాబజార్, సత్యభామ, అనసూయ వంటి సినిమాల్లో నటించారు. యోగా గురు భరత్ ఠాకూర్ ని 2007 లో పెళ్లి చేసుకున్నాక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించడం మొదలుపెట్టారు. ‘ ఎంఎస్ ధోనీ’లో సుశాంత్‌కి అక్కగా అలరించారు. అనేక తెలుగు సినిమాల్లో కూడా సహాయక పాత్రల్లో అలరించారు. ఓవైపు సినిమాలు చేస్తూనే భూమిక వ్యాపార రంగంలోకి  అడుగుపెట్టారు.

Shraddha Srinath : 18 ఏళ్ళప్పుడు క్రష్ కోసం టాటూ వేయించుకున్న హీరోయిన్.. ఎవరా క్రష్? టాటూ మీనింగ్ ఏంటి?

రీసెంట్‌గా భూమిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో గోవాలో కొత్త హోటల్ ప్రారంభించినట్లు వెల్లడిస్తూ పోస్టు పెట్టారు. భర్త, కొడుకుతో కలిసి హోటల్ ప్రారంభిస్తున్నట్లు ఫోటోలో కనిపించింది. ‘సమర’ వెల్ నెస్ హోటల్ పేరుతో బోర్డ్ కనిపిస్తుంది. బీచ్‌కి దగ్గరలో ఉన్న ఈ హోటల్‌లో రకరకాల ట్రీట్మెంట్‌తో పాటు స్పా, మ్యూజిక్, డ్యాన్స్ వంటివి ప్రొవైడ్ చేస్తున్నట్లు కూడా భూమిక తన పోస్టులో రాసుకొచ్చారు. ఓ వైపు పలు కొత్త ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉన్న భూమిక మరోవైపు బిజినెస్ వైపు తన లక్ పరీక్షించుకోబోతున్నారన్నమాట.  భూమిక పోస్టుకు నెటిజన్లు విషెస్ తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t)