Shraddha Srinath : 18 ఏళ్ళప్పుడు క్రష్ కోసం టాటూ వేయించుకున్న హీరోయిన్.. ఎవరా క్రష్? టాటూ మీనింగ్ ఏంటి?
జెర్సీ నటి శ్రద్దా శ్రీనాథ్‌ని చూసినపుడు ఆమె టాటూ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఆ టాటూ అర్ధం ఏంటి? ఎవరి కోసం వేయించుకున్నారు? అనే అంశాలపై ఈ నటి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

Shraddha Srinath
Shraddha Srinath : హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ మళయాళ సినిమా కోహినూర్‌తో వెండితెరపై అడుగుపెట్టారు. వరుస ప్రాజెక్టులు వస్తున్నా సెలక్టివ్‌గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రద్దా శ్రీనాథ్ ఎదపై ఓ టాటు కనిపిస్తుంది. అసలు ఆ టాటు అర్ధం ఏంటి? ఎవరి కోసం వేయించుకున్నారనేది రీసెంట్‌గా ఈ నటి రివీల్ చేశారు.
Sivaji : బిగ్‌బాస్ తర్వాత బోయపాటితో శివాజీ స్పెషల్ మీటింగ్.. ఏం ప్లాన్ చేస్తున్నారో?
శ్రద్దా శ్రీనాథ్ ‘కోహినూర్’ అనే మళయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కన్నడ సినిమా ‘యు-ట’ర్న్ తో మంచి పేరు తెచ్చుకున్నారు. ‘వేద; సినిమాతో తమిళంలో.. ‘జెర్సీ’ మూవీతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు కొట్టేశారు. వరుస పెట్టి ప్రాజెక్టులు వస్తున్నా ఆచి తూచి నచ్చిన కథలే చేసుకుంటూ వస్తున్నారు శ్రద్దా శ్రీనాథ్. ఇదిలా ఉంటే శ్రద్దా శ్రీనాధ్‌ని చూసినప్పుడు ఆమె ఎదపై టాటూ కనిపిస్తుంది. అయితే టాటూకి అర్ధమేంటని? ఎవరి కోసం వేయించుకున్నారని? చాలామందికి డౌట్ వస్తుంది. రీసెంట్‌గా శ్రద్దా ఈ టాటూ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
Rajamouli : జపాన్ భూకంపంపై రాజమౌళి ట్వీట్.. మా గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన దేశం అంటూ..
శ్రద్దా శ్రీనాథ్ 18 సంవత్సరాల వయసులో తన క్రష్ కోసం టాటూ వేయించుకున్నారట. ఆ టాటూ బీటల్స్ మ్యూజిక్ బ్రాండ్ లోగో అట. ఆ బ్రాండ్‌కి పరిచయం చేసింది కూడా తన క్రష్ అట. ఇంతకీ ఆ టాటూకి అర్ధం ఏంటంటే.. లవ్ అట. ఆ వయసులోనే క్రష్ కోసం శ్రద్దా టాటూ వేయించుకోవడం ఆశ్చర్యమనిపిస్తోంది. మరి ఆ క్రష్ వివరాలేంటో కూడా శ్రద్దాయే చెప్పాలి. ప్రస్తుతం శ్రద్దా శ్రీనాథ్ విక్టరీ వెంకటేష్‌కి జోడిగా ‘సైంధవ్’ సినిమాలో నటిస్తున్నారు. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది.
View this post on Instagram