Sivaji : బిగ్‌బాస్ తర్వాత బోయపాటితో శివాజీ స్పెషల్ మీటింగ్.. ఏం ప్లాన్ చేస్తున్నారో?
తాజాగా శివాజీ దర్శకుడు బోయపాటి శ్రీనుని కలిశారు. న్యూ ఇయర్ సందర్భంగా బోయపాటిని కలిసి శుభాకాంక్షలు తెలిపి కాసేపు ముచ్చటించారు శివాజీ.

Bigg Boss Sivaji Meets Director Boyapati Srinu Video goes Viral
Bigg Boss Sivaji :నటుడు శివాజీ ఇటీవల బిగ్‌బాస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. హౌస్ లో స్పై బ్యాచ్ అంటూ గట్టిగానే హడావిడి చేశాడు. ఇక బిగ్‌బాస్ అయిపోయిన తర్వాత కూడా శివాజీ బిజీగానే ఉన్నాడు. తన బ్యాచ్ పల్లవి ప్రశాంత్, యావర్ లో స్పెషల్ పార్టీలు చేసుకున్నాడు. మరో వైపు తను మెయిన్ లీడ్ లో నటించిన #90s వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ అవుతుండటంతో ఆ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.
తాజాగా శివాజీ దర్శకుడు బోయపాటి శ్రీనుని కలిశారు. న్యూ ఇయర్ సందర్భంగా బోయపాటిని కలిసి శుభాకాంక్షలు తెలిపి కాసేపు ముచ్చటించారు శివాజీ. దీంతో శివాజీ బోయపాటిని కలిసిన ఫోటోలు వీడియోలు వైరల్ అవ్వగా ఈ మీటింగ్ ఇప్పుడు చర్చగా మారింది. ఇక బోయపాటిని కలిసిన వీడియో శివాజీ తన ఛానల్ లో పోస్ట్ చేశారు.
Also Read : Rajamouli : జపాన్ భూకంపంపై రాజమౌళి ట్వీట్.. మా గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన దేశం అంటూ..
శివాజీ గతంలో ఏపీ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో ఏపీలో పాలిటిక్స్ రానున్నాయి. ఇక బోయపాటి టీడీపీకి పూర్తి సపోర్ట్ ఇస్తారు. గతంలో టీడీపీ కోసం యాడ్స్ కూడా చేశారు. దీంతో వీరి మీటింగ్ అటు రాజకీయంగా కూడా చర్చగా మారింది.