Rajamouli : జపాన్ భూకంపంపై రాజమౌళి ట్వీట్.. మా గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన దేశం అంటూ..

జపాన్ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు. తాజాగా రాజమౌళి జపాన్ భూకంపంపై స్పందించాడు.

Rajamouli : జపాన్ భూకంపంపై రాజమౌళి ట్వీట్.. మా గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన దేశం అంటూ..

Director Rajamouli Reaction on Japan Earthquake Tweet goes Viral

Updated On : January 2, 2024 / 12:19 PM IST

Rajamouli on Japan Earthquake : నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జపాన్(Japan) లోని చాలా ప్రాంతాల్లో భూకంపం(Earthquake) వచ్చిన సంగతి తెలిసిందే. ఆల్మోస్ట్ 7 తీవ్రతతో భూకంపం జపాన్ ని వణికించింది. ఈ భూకంపంలో ఇప్పటికే 20 మందికి పైగా మరణించగా, భారీ ఆస్తి నష్టం జరిగింది. దీంతో జపాన్ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

జపాన్ లో మన తెలుగు హీరోలకు అభిమానులు ఎక్కువ అని తెలిసిందే. RRR సినిమాతో చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిలకు కూడా భారీగా అభిమానులు ఏర్పడ్డారు జపాన్ లో. జపాన్ ప్రేక్షకులు మన ఇండియన్ సినిమాలు, ముఖ్యంగా తెలుగు సినిమాలను బాగా ఆదరిస్తారు. దీంతో మన సెలబ్రిటీలు కూడా జపాన్ త్వరగా కోలుకోవాలి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

తాజాగా రాజమౌళి జపాన్ భూకంపంపై స్పందించాడు. రాజమౌళి తన ట్వీట్ లో.. జపాన్ లో వరుస భూకంపాలు వచ్చి ఎఫెక్ట్ అయింది అని వినడం చాలా కష్టంగా ఉంది. జపాన్ దేశం మా హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ ఘటనలో భాదపడ్డవారికి ప్రగాఢ సానుభూతి. జపాన్ త్వరగా కోలుకోవాలి అంటూ ట్వీట్ చేశారు. చివర్లో గుడ్ లక్ అని అర్ధం వచ్చేలా జపనీస్ భాషలో రాశారు. దీంతో రాజమౌళి ట్వీట్ వైరల్ గా మారయింది.

Also Read : Jr NTR : జపాన్ భారీ భూకంపం నుంచి జస్ట్ మిస్.. స్పందించిన ఎన్టీఆర్

జపాన్ భూకంపంపై జూనియర్ ఎన్టీఆర్ కూడా నేడు తెల్లవారుజామున ట్వీట్ చేశారు. గత వారం రోజులు ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి జపాన్ లోనే ఉన్నారు. వెకేషన్ కోసం వెళ్లిన ఎన్టీఆర్ నిన్న రాత్రే ఇండియాకు తిరిగి వచ్చారు. ఎన్టీఆర్ విమానంలో ఉన్న సమయంలో జపాన్ లో ఈ భకంపం సంభవించింది. దీంతో ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ.. జపాన్ నుంచి ఇవాళే ఇంటికి తిరిగి వచ్చాను. భూకంపం వార్త విని షాక్ అయ్యాను. గత వారం అంతా జపాన్ లోనే గడిపాను. మేం సేదతీరిన ప్రాంతంలో భూకంపం రావడం నా హృదయాన్ని కలిచివేసింది. అక్కడి ప్రజల దృఢత్వానికి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. స్టే స్ట్రాంగ్ జపాన్ అని ట్వీట్ చేశారు.

Also Read : Japan Earthquake : జపాన్‌లో భారీ భూకంపం.. 24 మంది మృతి

మరో పక్క జపాన్ లో సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జపాన్ త్వరగా కోరుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.