Sandeep Reddy Vanga viral comments about Prabhas Spirit movie
Spirit : అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సందీప్ రెడ్డి వంగ నేషనల్ వైడ్ ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు. ఆయన సినిమాల్లో హీరో పాత్ర చాలా ఇంటెన్స్ తో ఆడియన్స్ ని బాగా హిట్ చేస్తుంది. దీంతో ఆయనతో సినిమా చేసేందుకు ప్రతి ఒక్క నటుడు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ వరుసలో ప్రభాస్ కూడా ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ప్రభాస్ నుంచి సందీప్ కి ఒక ఆఫర్ వెళ్లిందట. ఈ విషయం గురించి సందీప్ వంగ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
సందీప్ వంగని ప్రభాస్ పిలిచి ఓ సూపర్ హిట్ హాలీవుడ్ మూవీని తెలుగులో రీమేక్ చేద్దామని అడిగారట. కానీ దానికి సందీప్ వంగ నో చెప్పారట. మనకి రీమేక్స్ ఎందుకు, ఒరిజినల్ కథతో వెళ్దాం. ఒక మంచి ఐడియా వస్తే మీకు చెబుతానని ప్రభాస్ తో సందీప్ వంగ చెప్పారట. కొన్నాళ్ల తరువాత ఓ ఐడియా వస్తే.. వెంటనే ప్రభాస్ దగ్గరికి వెళ్లి అది వినిపించారట. ప్రభాస్ కి అది బాగా నచ్చేసి, సినిమా చేయడానికి ఓకే చెప్పారట. అలా స్పిరిట్ సినిమా సెట్ అయ్యింది.
Also read : Sandeep Reddy Vanga : ‘ఉప్పెన’ సినిమాని డైరెక్ట్ చేస్తా అంటున్న సందీప్ వంగ.. అలాగే ఆ రెండు బయోపిక్స్..
HOLLYWOOD FILM REMAKE ?????
Guess the Film ✅#Prabhas #SandeepReddyVanga pic.twitter.com/P7FHnLCHHV
— GetsCinema (@GetsCinema) April 8, 2024
ఈ సినిమాలో ప్రభాస్ నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ప్రభాస్ కెరీర్ లో మొదటిసారి ఈ సినిమాలోనే పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషిస్తున్నారు. ఇక ఈ రోల్.. సందీప్ వంగ గత చిత్రాల్లోని హీరో పాత్రలు మాదిరి హార్డ్ హిట్టింగ్ గానే ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికి 60 శాతం స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసినట్లు సందీప్ వంగ చెప్పుకొచ్చారు. ఇక ఈ మూవీకి దాదాపు 300 కోట్ల బడ్జెట్ ని పెడుతున్నట్లు వెల్లడించారు.
ప్రభాస్ కి ఉన్న ఇమేజ్‌కి ఈ సినిమా మొదటిరోజే 150 కోట్ల కలెక్షన్స్ రాబట్టేస్తుందని సందీప్ వంగ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాని నవంబర్ లేదా డిసెంబర్ లో సెట్స్ పైకి తీసుకు వెళ్తున్నట్లు సందీప్ వంగ తెలియజేసారు. ఈ మూవీ పై ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను సందీప్ వంగ ఎంతవరకు అందుకుంటారో చూడాలి.