×
Ad

Bigg Boss 9 Telugu: బై బై సంజన.. బిగ్ బాస్ 9లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. షాక్ లో కంటెస్టెంట్స్.. ఇది కదా ట్విస్ట్ అంటే!

బిగ్ బాస్ సీజన్ 9 ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంటోంది. కంటెస్టెంట్స్ లో జోష్ తగ్గినా(Bigg Boss 9 Telugu).. ఎంటర్టైన్మెంట్ లో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు బిగ్ బాస్.

Sanjana eliminated from Bigg Boss Season 9

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంటోంది. కంటెస్టెంట్స్ లో ఆ జోష్ తగ్గినా.. ఎంటర్టైన్మెంట్ లో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు బిగ్ బాస్. రోజుకో కొత్త టర్న్ తీసుకుంటూ ఆటను రసవత్తరంగా మారుస్తున్నాడు. ఆ విషయాన్ని మాత్రం ఆడియన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్స్ ఇంటినుంచి బయటకు వెళ్లిపోగా.. తాజాగా వైల్డ్ కార్డు ఎంట్రీని తీసుకొచ్చాడు బిగ్ బాస్. బిగ్ బాస్ అగ్ని(Bigg Boss 9 Telugu)పరీక్షల్ల పాల్గొన్న కంటెస్టెంట్ ను ఇంట్లోకి రప్పించాడు. కానీ, హౌస్ మేట్స్ అంతా కలిసి ఆమెను లోపలి రానివ్వకుండా ప్లాన్ చేశారు. కానీ, బిగ్ బాస్ వాళ్లకన్నా పెద్ద స్కెచ్ వేశాడు.

Sriya Reddy: ఓజీ నీ త్యాగాలకు నిదర్శనం.. నటి శ్రియారెడ్డి కామెంట్స్ వైరల్

హౌస్ మేట్స్ రిజెక్ట్ చేసిన కంటెస్టెంట్స్ నే తిరిగి ఇంట్లోకి తీసుకువచ్చాడు. దాంతో, కంటెస్టెంట్స్ అంతా అవాక్కయ్యారు. ఆడియన్స్ కూడా ఈ విషయంలో షాకయ్యారు. ఆ షాక్ నుంచి ఇంకా బయటకు రాకముందే మరో షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 9 మూడవవారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ కు తెరలేపాడు. కంటెస్టెంట్స్ అంతా డిస్కస్ చేసుకొని ఒకరిని బయటకు పంపాలి అని ఆర్డర్ వేశాడు. దాంతో అందరు డిస్కస్ చేసుకొని సంజన ని బయటకు పంపాలనుకుంటున్నట్టుగా బిగ్ బాస్ కి చెప్పారు. వెంటనే, బిగ్ బాస్ కూడా సంజన మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్లాల్సిందిగా ఆర్డర్ వేశాడు.

భరణి శంకర్ దగ్గరుండి సంజనను బయటకు పంపాడు. ఇమ్మాన్యుయేల్, తనూజ, ఫ్లోరా కాస్త ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబందించిన ప్రోమో తాజాగా విడుదల అయ్యింది. ఇది చూసిన ఆడియన్స్ సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదేం ట్విస్ట్ బిగ్ బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ప్రోమో చూసిన మరికొంత మంది సంజనది నిజమైన ఎలిమినేషన్ కాదని, ఆమెను సీక్రెట్ రూమ్ లోకి పంపించారని అనుకుంటున్నారు. ప్రతీ సీజన్ లో ఒకరిని సీక్రెట్ రూమ్ కి పంపించడం మాములే. అలా ఈ సీజన్ లో సంజనను పంపారని చెప్తున్నారు. మరి అదే నిజమైతే సంజన ఆట మరింత మెరుగవడం ఖాయం.