Sriya Reddy: ఓజీ నీ త్యాగాలకు నిదర్శనం.. నటి శ్రియారెడ్డి కామెంట్స్ వైరల్

ఓజీ సినిమాతో పవర్ స్టార్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు దర్శకుడు సుజీత్.(Sriya Reddy) అత్తారింటికి దారేది తరువాత మళ్ళీ ఆ రేంజ్ సినిమాను అందించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.

Sriya Reddy: ఓజీ నీ త్యాగాలకు నిదర్శనం.. నటి శ్రియారెడ్డి కామెంట్స్ వైరల్

Actress Sriya Reddy praises OG director Sujeeth

Updated On : September 26, 2025 / 2:41 PM IST

Sriya Reddy: ఓజీ సినిమాతో పవర్ స్టార్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు దర్శకుడు సుజీత్. అత్తారింటికి దారేది తరువాత మళ్ళీ ఆ రేంజ్ సినిమాను అందించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ ను ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అదే రేంజ్ ల్లో ఆయన్ని ప్రెజెంట్ చేయడంలో 1000 పెర్సెంట్ సక్సెస్ అయ్యాడు. ఈ విషయంలో దర్శకుడు సుజీత్ పై అటు ఆడియన్స్ నుంచి, ఇటు ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. తాజా ఈ లిస్టులో నటి శ్రియారెడ్డి కూడా చేరిపోయింది. ఓజీ విజయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె.. సుజీత్ చేసిన త్యాగాలకు నిదర్శనమే ఓజీ(Sriya Reddy) అంటూ కామెంట్ చేశారు.

OG Title: ఏంటి.. ఓజీ పవన్ కళ్యాణ్ టైటిల్ కాదా.. మరి ఎవరికోసం అనుకున్నారు?

‘‘దర్శకుడు సుజీత్‌ రాసిన పాత్ర తెరపై మరోసారి అద్భుతాన్ని సృష్టించింది. ఓజీ లాంటి సినిమాను ఒకే చేయడం, అంత పెద్ద ప్రాజెక్ట్‌లో గుర్తింపు తెచ్చుకోవడం అనేది చిన్న విషయం కాదు. అందుకు ఆత్మవిశ్వాసం ఉన్న దర్శకుడు చాలా అవసరం. అలాంటి దర్శకుడే సుజీత్‌. గీత ఈ పాత్రకు నన్ను ఎంపిక చేసినందుకు సుజీత్ కు నా ధన్యవాదాలు. ఉన్నతంగా ఆలోచించినప్పుడు మాత్రమే ఇలాంటి ఊహకందని అద్భుతాలు జరుగుతాయి. నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో మీరూ(సుజీత్) ఒకరు. ఈ విజయానికి మీరు పూర్తి అర్హులు. మీ కృషి, ఆత్మవిశ్వాసం, మీరు చేసిన త్యాగాలే ఈ విజయానికి నిదర్శనం’’ అంటూ పోస్ట్‌ పెట్టారు. దాంతో ఆమె చేసిన ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఓజీ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే, కేవలం ప్రీ సేల్స్ తోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా మొదటిరోజు ఏకంగా రూ.170 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందని టాక్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఇదే ఊపు కొనసాగితే సోమవారం కల్లా ఈ సినిమా బ్రేకీవెన్ సాధించి లాభాల బాట పట్టె అవకాశం ఉంది.