Bigg Boss 9 Telugu: ఎలిమినేట్ అవుతుంది అన్నారు.. ఫస్ట్ కెప్టెన్ అయ్యింది.. పాపం కంటెస్టెంట్స్ కి ఇక చుక్కలే!

బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. మొదటిరోజు మొదలైన రచ్చ(Bigg Boss 9 Telugu) ఐదో రోజు కూడా కొనసాగుతూనే ఉంది.

Sanjana Galrani becomes the first captain of Bigg Boss Season 9

Bigg Boss 9 Telugu:  బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. మొదటిరోజు మొదలైన రచ్చ ఐదో రోజు కూడా కొనసాగుతూనే ఉంది. ఇక నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో విజయం సాధించి బిగ్ బాస్ సీజన్ 9కి ఫస్ట్ కెప్టెన్ గా సంజన గల్రాని నిలిచారు. దీంతో హౌస్ మేట్స్ అందరు ఒక్కసారిగా అవాక్కయ్యారు. నిజానికి హౌస్ లో ఉన్న సెలబ్రెటీలు, సామాన్యులు మొత్తం సంజనకు రివర్స్ గానే ఉన్నారు. దాదాపు అందరూ కూడా సంజన కెప్టెన్ (Bigg Boss 9 Telugu)అవ్వకూడదని కోరుకున్నారు. కానీ, తామొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు.. సీజన్ 9కి తొలి కెప్టెన్ గా ఎంపికయ్యింది సంజన గల్రాని.

Disha Patani: బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ఇంటిపై కాల్పులు.. ఆమె సోదరి ఖుష్బూ పటానీ టర్గెట్

ఇక కెప్టెన్ బ్యాండ్ ధరించిన సంజన.. అప్పుడే డ్యూటీ కూడా ఎక్కేసింది. మొదటగా ఫ్లోరాను లగేజ్ తీసుకోరావాల్సిందిగా ఆర్డర్ వేసింది. కానీ, దానికి ఫ్లోరా నేను తీసుకురానని ముఖం మీదే చెప్పేసింది. దానికి, సంజన రియాక్ట్ అవుతూ కెప్టెన్ చెప్పింది వినాలి వినకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఆ తరువాత హౌస్ అంతా కలిసి స్కిట్ చేయాలని, తనకు వంట చేసి పెట్టాలని ఆర్డర్ మీద ఆర్డర్స్ వేసింది సంజన.

సంజన ప్రవర్ధన నచ్చని కామనర్లు సంజనకి వచ్చిన లగ్జరీ ఐటెమ్స్‌ని దొంగిలించారు. కెప్టెన్ కోసం బిగ్‌బాస్ పంపిన లగ్జరీ ఐటెమ్స్ చాక్లెట్లు, చిప్స్ ప్యాకెట్లను కొట్టేశారు. ఇక హౌస్‌లో అంతా కలిసి స్కిట్ చేసి తనను నవ్వించాలని, తనను మెప్పించిన వారికి ఒక్కో థంమ్స్ అప్ ఇస్తానని అనౌన్స్ చేసింది సంజన. స్కిట్ అయిన తన దగ్గర కొట్టేసిన థంమ్స్ అప్ ఇవ్వాలని, అది ఇస్తేనే అందరికీ థంమ్స్ అప్ ఇస్తానని చెప్పింది. దాంతో, థంమ్స్ అప్ దొంగిలించిన హరీష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇక ఈ వారం నామినేషన్ విషయానికి వస్తే, శ్రష్ఠి వర్మ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ, తనూజా గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమన్ పవన్, ఇమ్మానుయేల్ ఉన్నారు. వీరి ఒకరు ఈవారం హౌస్ నుంచి మొదటి వారం బయటకు వెళ్లనున్నారు.