Disha Patani : బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ఇంటిపై కాల్పులు..

బాలీవుడ్ హీరోయిన్ భామ దిశా(Disha Patani) ఇంటి ముందు కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని బరేల్లీలో సెప్టెంబర్ 12, 2025 ఉదయం సుమారు 3-4:30 సమయంలో ఈ ఘటన జరిగిందని సమాచారం.

Disha Patani : బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ఇంటిపై కాల్పులు..

Gunfire reported in front of Disha Patani's house

Updated On : September 13, 2025 / 9:57 AM IST

బాలీవుడ్ హీరోయిన్ భామ దిశా ఇంటి ముందు కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని బరేల్లీలో సెప్టెంబర్ 12, 2025 ఉదయం సుమారు 3-4:30 సమయంలో ఈ ఘటన జరిగిందని సమాచారం. మోటర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దిశా పటానీ ఇంటి పై 6 నుంచి 7 రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే, ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో(Disha Patani) ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Renu Desai: ఎవరేమనుకున్నా నాకు భయం లేదు.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి రేణూ దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇదిలా ఉంటే, ఈ కాల్పులకు కారణం దిశా పటాని సోదరి ఖుష్బూ పటానీ అని తెలుస్తోంది. ఆమె జూలై నెలలో హిందూ సాధువులైన ప్రేమానంద్ మహారాజ్, నిరుద్ధాచార్య మహారాజ్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిందట. దాంతో వారి అభిమానులు కొందరు ఆగ్రహించి ఈ పని చేశారని తెలుస్తుంది. ఇక కాల్పులు జరిగిన సమయంలో ఆ ఇంట్లో దిశా తల్లిదండ్రులు, సోదరి ఖుష్బూ ఉన్నారు. ఇక కాల్పులకు కారణం తామే అంటూ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా గ్యాంగ్ సభ్యులు విరేంద్ర చారణ్, మహేంద్ర సరణ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. సనాతన ధర్మానికి అవమానం కలిగిస్తే మరింత తీవ్ర చర్యలు తీసుకుంటామని, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అని తెలిపారు. ప్రస్తుతం ఈ కాల్పుల ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.