Renu Desai: ఎవరేమనుకున్నా నాకు భయం లేదు.. పవన్ ఫ్యాన్స్‌కి రేణూ దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు(Renu Desai). ఆ విషయంలో నా గురించి ఎవరు ఏమనుకున్నా నాకు భయం లేదు అంటూ తెగేసి చెప్పేశారు.

Renu Desai gives a strong warning to Pawan Kalyan fans
Renu Desai: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ విషయంలో నా గురించి ఎవరు ఏమనుకున్నా నాకు భయం లేదు అంటూ తెగేసి చెప్పేశారు. ప్రస్తుతం ఆమె ఇన్ స్టాలో చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. నటి రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకొని, తరువాత కొంతకాలానికి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల తరువాత పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకోగా.. రేణు దేశాయ్(Renu Desai) మాత్రం ఇంకా ఒంటరిగానే ఉంటున్నారు. తన పిల్లల చదువులు చూసుకుంటున్నారు.
Ram Gopal Varma: బిగ్ షౌట్ అవుట్.. బాహుబలి తరువాత మిరాయ్.. రామ్ గోపాల్ వర్మ క్రేజీ ట్వీట్
అయితే, రేణు దేశాయ్ సైతం గతంలో రెండో పెళ్లి చేసుకుంటున్నారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ, ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుండి ఆమె తీవ్రమైన నెగిటివిటీని ఎదుర్కొన్నారు. మీరు రెండో పెళ్లిచేసుకోవడానికి వీలు లేదు అంటూ కొంతమంది ఆమెకు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఆ విషయంపై చాలా సీరియస్ అయ్యారు రేణు దేశాయ్. ఇది నా జీవితం, నా ఇష్టానుసారంగా బ్రతకడం నా హక్కు. అందులో మీకు ఎలాంటి జోక్యం లేదు.. అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అప్పటి నుండి మళ్ళీ ఆ టాపిక్ తెరకపైకి రాలేదు. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒకరు ఇదే విషయంపై రేణు దేశాయ్ కి కోపం తెప్పించాడు.
మిమ్మల్ని ఇంకా మేము పవన్ కళ్యాణ్ భార్యగానే చూస్తున్నాం. మీ జీవితంలో వేరే వాళ్ళని ఊహించుకోలేకపోతున్నాం అంటూ కామెంట్ చేశాడు. దానికి చాలా సీరియస్ గా రిప్లై ఇచ్చింది రేణు దేశాయ్.. ఈ కామెంట్ చేసిన వ్యక్తి కొంత చదువుకున్నవాడే అని అనుకుంటున్నా. కానీ మనం 2025లో ఉన్నాం. అయినప్పటికీ, స్త్రీలు మాత్రం భర్త లేదా తండ్రి ఆస్తి అనే మనస్తత్వం సమాజంలో బలంగా నాటుకుపోయింది. కారణం పితృస్వామ్యమే. ఇప్పటికీ మహిళలు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అంటే ‘పర్మిషన్’ అవసరం అవుతోంది. మహిళలంటే వంట చేయడం, పిల్లలు కనడం మాత్రమే అని భావించే మగవాళ్లు ఇంకా ఉన్నారు. ఈ ధోరణికి నేను వ్యతిరేకం. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా భయపడను. భవిష్యత్ తరాల మహిళల కోసం మార్పు తీసుకురావడమే నా ప్రయత్నం” అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.