Sanjay Dutt Comments on South Movies
Sanjay Dutt: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ సౌత్ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కన్నడ చిత్రసీమ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియన్ యాక్షన్ మూవీ “KD ది డెవిల్”. ఈ చిత్రంలో సంజయ్ ఒక్క కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ను గురువారం బెంగళూరులో విడుదల చేశారు.
Sankranti Cinema Fight: సంక్రాంతి భారీ నుంచి తగ్గేది లేదంటున్న పందెం కోళ్లు..
ఈ కారిక్రమానికి సంజయ్ దత్ కూడా హాజరయ్యాడు. సంజయ్ మాట్లాడుతూ..”నేను KGFలో పనిచేశాను, ఇప్పుడు దర్శకుడు ప్రేమ్‌తో KDలో పని చేస్తున్నాను. భవిషత్తులో కూడా మరిన్ని సౌత్ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నా. సౌత్‌లో చేసే సినిమాల్లో నాకు చాలా ప్యాషన్, లవ్, ఎనర్జీ, హీరోయిజం కనిపిస్తాయి.
బాలీవుడ్ ఈ విషయాలని మర్చిపోయింది, మళ్ళీ తిరిగి నేర్చుకోవాలి. అంతేకాదు హిందీ సినిమా మూలలను కూడా మర్చిపోకూడదంటూ” వ్యాఖ్యానించాడు. ఇక “KD ది డెవిల్” సినిమా 1970లో నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాబోతుంది. విడుదలైన టీజర్ మూవీపై అంచనాలను పెంచేలా ఉంది. ఈ సినిమాలో కన్నడ హీరో ‘ధృవ సర్జా’ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.