‘కె.జి.యఫ్ 2’ లొకేషన్‌లో మొక్కలు నాటిన అధీరా..

‘కె.జి.యఫ్ 2’ లొకేషన్‌లో మొక్కలు నాటిన అధీరా..

Updated On : December 17, 2020 / 4:57 PM IST

Sanjay Dutt: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమానికి ప్రముఖుల నుండి మంచి స్పందన వస్తోంది. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ మొక్కలు నాటారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుట పడింది. చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన ‘కె.జి.యఫ్’ సీక్వెల్ ‘కె.జి.యఫ్ 2’ లో అధీరా క్యారెక్టర్ చేస్తున్నారు సంజయ్ దత్.. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ బచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. షూటింగ్ విరామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని 8 మొక్కలు నాటారు సంజూ బాబా..

ఈ మహత్తర కార్యక్రమంలో తన అభిమానులందరూ పాల్గొని ప్రతి ఒక్కరు మూడేసి మొక్కల చొప్పున నాటాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా ఇంతకుముందు డిసెంబర్ 7న జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ పుట్టిన రోజు సందర్భంగా శిల్పారామంలో ఏర్పాటు చేసిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు సంజయ్ దత్.

Sanjay Dutt

Sanjay Dutt

Sanjay Dutt