Sanjay Dutt : అక్కడ హీరోయిజం ఉండాల్సిందే.. సౌత్ సినిమాలపై సంజయ్ దత్ వ్యాఖ్యలు..
సౌత్ సినిమాలపై సంజయ్ దత్ మాట్లాడుతూ.. ''దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిజాన్ని మరువరు. ఇప్పటికీ అక్కడ హీరో ఎంట్రీ సీన్‌లో గాల్లో దుమ్ము రేగాల్సిందే. థియేటర్లలో.......

Sanjay
Sanjay Dutt : ఇటీవల కాలంలో సౌత్ సినిమాలు వరుస భారీ విజయాలు సాధిస్తూ బాలీవుడ్ ని బాదేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రోజు రోజుకి సౌత్ సినిమాలకి డిమాండ్ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది బాలీవుడ్ వర్గాలు సౌత్ సక్సెస్ ని చూసి కుళ్ళుకుంటుంటే కొంతమంది మాత్రం సౌత్ సినిమాల్లో నటించడానికి, ఈ సక్సెస్ లో భాగమవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ‘కేజీయఫ్ 2’లో అధీరాగా బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో సంజయ్ దత్ మెప్పించారు.
ఈ సినిమాలో అధీరాగా సంజయ్ దత్ తన నట విశ్వరూపాన్ని చూపించారు. విలన్ గా హీరోకి గట్టి పోటీ ఇచ్చారు. ఈ సినిమాతో మరోసారి సంజయ్ భారీ సక్సెస్ ని అందుకున్నారు. తన నటనకి బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేజిఎఫ్ 2 సక్సెస్ అయిన సందర్భంగా పలువురు బాలీవుడ్ మీడియా సంస్థలు సంజయ్ దత్ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంజయ్ సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Prabhas : అందరూ నా పెళ్లి గురించే అడుగుతారు..
సౌత్ సినిమాలపై సంజయ్ దత్ మాట్లాడుతూ.. ”దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిజాన్ని మరువరు. ఇప్పటికీ అక్కడ హీరో ఎంట్రీ సీన్‌లో గాల్లో దుమ్ము రేగాల్సిందే. థియేటర్లలో విజిల్స్ పడాల్సిందే. ఒకప్పుడు బాలీవుడ్‌లోనూ ఎలివేషన్ సీన్లకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఇటీవల బాలీవుడ్ లో తగ్గినా సౌత్ సినిమాల్లో మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది. త్వరలో మన దగ్గర కూడా ఇలాంటి సినిమాలు వస్తాయి. అలాగే సౌత్ సినిమాల్లో హీరోతో పాటు విలనిజాన్ని కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. హీరో, విలన్ ఎవరైనా ఎంట్రీ సీన్ మాత్రం సౌత్ సినిమాల్లో అదిరిపోయేలా ఉంటుంది” అని అన్నారు.