Sanjjanaa Galrani : తెలుగు సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ సంజన.. కొత్త సీరియల్ ఎప్పట్నించి? ఎందులో..?

సంజనతో పాటు సోనియా, శ్రవణ్ ముఖ్య పాత్రలుగా ‘ఏ దేవి వ‌ర‌మో నీవు’ అనే సీరియల్ తెరకెక్కుతుంది. (Sanjjanaa Galrani)

  • Published on- July 5, 2026 / 02:21 PM IST

Ye Devi Varamo Neevu

Sanjjanaa Galrani : పలు సినిమాలతో తెలుగు వారికి దగ్గరైన కన్నడ నటి సంజన మధ్యలో సినిమాలకు దూరమైంది. పలు ఆరోగ్య సమస్యలు, పెళ్లి, పిల్లలు, ఓ కేసు విషయం.. ఇలా పలు కారణాలతో కెరీర్ గ్యాప్ తీసుకున్న సంజన ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పాల్గొని రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తెలుగులో ఓ సీరియల్ లో ఎంట్రీ ఇస్తుంది.

సంజనతో పాటు సోనియా, శ్రవణ్ ముఖ్య పాత్రలుగా ‘ఏ దేవి వ‌ర‌మో నీవు’ అనే సీరియల్ తెరకెక్కుతుంది. ఈ సరికొత్త సీరియల్ జులై 6 నుంచి స్టార్ మా ఛానల్ లో సోమ‌వారం నుంచి శ‌నివారం రాత్రి 8 గంట‌ల 30 నిమిషాల‌కు స్ట్రీమింగ్ అవ్వనుంది.

Also Read : Narne Nithiin : ఎన్టీఆర్ బామ్మర్ది కొత్త సినిమా ఓపెనింగ్.. హీరోయిన్స్ ఎవరంటే..

ఇక ఈ సీరియల్.. ప్రేమికుడు మోసం చేసిన గీతాంజ‌లి ఓ పాప‌కు జ‌న్మ‌నిస్తుంది. ఆమె తండ్రి, అన్న‌య్య ఆ పాప‌ను త‌మ వార‌సురాలిగా అంగీక‌రించ‌రు. దాంతో ఆమెను ఓ అనాథ ఆశ్ర‌మంలో వ‌దిలేస్తారు. అక్క‌డే అంజ‌లి పేరుతో పెరిగి పెద్ద‌యిన ఆ పాప‌ అనుకోని ప‌రిస్థితుల్లో త‌న త‌ల్లి చెంత‌కే చేరుకోవాల్సి వ‌స్తుంది. ఇంత‌కీ గీతాంజ‌లి త‌న కూతురు అంజ‌లిని గుర్తు ప‌డుతుందా? త‌ల్లి ప్రేమ‌కు ప‌రిత‌పించే అంజ‌లికి అమ్మ ఆప్యాయ‌త ద‌క్కుతుందా అనే కథాంశంతో తెరకెక్కుతుంది.

తాజాగా ఈ సీరియల్ గ్రాండ్ ప్రీమియ‌ర్ లాంచ్ ఈవెంట్‌ కూడా హైదరాబాద్ లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి గుండె నిండా గుడిగంట‌లు సీరియ‌ల్ హీరో బాలు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సీరియల్ నటీనటులు కూడా హాజరయి సందడి చేసారు. ఈవెంట్ లో మొద‌టి ఎపిసోడ్‌ కూడా ప్ర‌ద‌ర్శించారు. మరి ఈ ఏ దేవి వ‌ర‌మో నీవు సీరియ‌ల్‌ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో, సీరియల్ లో సంజన ఎలా నటిస్తుందో చూడాలి.