×
Ad

Sankranthi 2027 : మొన్నే కదా సంక్రాంతి అయింది.. అప్పుడే నెక్స్ట్ సంక్రాంతికి సినిమాలు రెడీ.. బరిలో ఎవరెవరు ఉన్నారంటే..

అప్పుడే నెక్స్ట్ 2027 సంక్రాంతికి కర్చీఫ్ లు వేసుకుంటున్నారు. (Sankranthi 2027)

Sankranthi 2027

  • 2026 సంక్రాంతి సక్సెస్
  • 2027 సంక్రాంతికి ప్లానింగ్
  • నెక్స్ట్ సంక్రాంతికి లైన్లో ఉన్న సినిమాలు

Sankranthi 2027 : సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగ మాత్రమే కాదు సినిమాల పండగ కూడా. సంక్రాంతికి సినిమా వస్తే హిట్ గ్యారెంటీ. ఒకవేళ సినిమా బాగోకపోయినా కలెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకే చిన్న నుంచి పెద్ద హీరోల వరకు అందరూ తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు. ఇటీవల సంక్రాంతి పోటీ మరీ ఎక్కువైంది.(Sankranthi 2027)

గతంలో రెండు పెద్ద సినిమాలు, ఒక చిన్న సినిమా ప్రతి సంక్రాంతికి ఉండేవి. రాను రాను ఆ సంఖ్య పెరిగిపోతుంది. ఈ సంక్రాంతికి ఏకంగా 5 తెలుగు సినిమాలు సంక్రాంతికి వచ్చాయి. అదృష్టం బాగుండి, అన్ని ఫ్యామిలీ, కామెడీ సినిమాలు కావడంతో అందరికి నచ్చాయి, కలెక్షన్స్ తెచ్చుకున్నాయి. ఒక్క రాజాసాబ్ మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నా ఫ్యామిలీ సినిమా కాకపోయినా మంచి కలెక్షన్స్ వచ్చాయి.

2026 సంక్రాంతి అయిపోయి వారం రోజులు కూడా అవ్వలేదు, ఇంక థియేటర్స్ లో సినిమాలు నడుస్తున్నా అప్పుడే నెక్స్ట్ 2027 సంక్రాంతికి కర్చీఫ్ లు వేసుకుంటున్నారు. టాలీవుడ్ జనాలకు ఈ సంక్రాంతి రిజల్ట్ తో బాగా అర్థమైంది. అందుకే సంక్రాంతికి ఎలాగైనా సినిమా దించాలి అనుకుంటున్నారు.

Also Read : Tollywood Directors : టాలీవుడ్ యువ డైరెక్టర్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో.. ఫోటోలు వైరల్..

Sankranthi 2027

టాలీవుడ్ సమాచారం ప్రకారం 2027 సంక్రాంతి రేసులోకి వచ్చిన సినిమాలు ఇవే..

అనిల్ రావిపూడి ఇప్పటికే నాలుగు సంక్రాంతి పండగలకు వచ్చి హిట్స్ కొట్టాడు. ఈ సంవత్సరం చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు తో భారీ హిట్ కొట్టాడు. వచ్చే సంక్రాంతికి కూడా వస్తాను అని ప్రకటించేశాడు. వెంకటేష్ తో అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్ అవుతుందని సమాచారం.

ఇక హీరో శర్వానంద్ కూడా ఈ సంవత్సరం నారీ నారీ నడుమ మురారి హిట్ తో కలిపి మొత్తం మూడు సంక్రాంతిలు హిట్స్ కొట్టాడు. దీంతో వచ్చే సంక్రాంతికి శ్రీను వైట్ల దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో వస్తానని అధికారికంగా చెప్పేసాడు.

చిరంజీవి కెరీర్లో చాలా సంక్రాంతి సినిమాలు చూసారు. ఈసారి వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు బోనస్. వచ్చే సంక్రాంతికి బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో వస్తారని టాక్ నడుస్తుంది. ఆల్రెడీ బాబీ – చిరంజీవి కాంబోలో వచ్చిన వాల్తేర్ వీరయ్య సినిమా గతంలో సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టింది.

ఇక వీటితో పాటు తేజ సజ్జా సినిమా ఒకటి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ సినిమా ఒకటి కూడా సంక్రాంతి బరిలో దిగాలని ప్లాన్ చేస్తున్నాయి. వీటితో పాటు కమల్ హాసన్ నిర్మిస్తున్న రజనీకాంత్ సినిమా కుడా వచ్చే సంక్రాంతికే అని తెలుస్తుంది. దీంతో 2027 సంక్రాంతి అప్పుడే ఫుల్ ప్యాక్ అయింది. మరి ఆ సమయానికి ఎవరు మిగులుతారో, ఎవరు తప్పుకుంటారో చూడాలి.

Also Read : Abbas : ఒకప్పటి లవర్ బాయ్ అబ్బాస్ రీ ఎంట్రీ అదిరిందిగా.. ‘హ్యాపీ రాజ్’ ప్రోమో రిలీజ్..