Tollywood Directors : టాలీవుడ్ యువ డైరెక్టర్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో.. ఫోటోలు వైరల్..
తాజాగా పలువురు టాలీవుడ్ యువ దర్శకులు అంతా ఒకే ఫ్రేమ్ లో కనపడటంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

తాజాగా పలువురు టాలీవుడ్ యువ దర్శకులు అంతా ఒకే ఫ్రేమ్ లో కనపడటంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

దర్శకుడు గవిరెడ్డి శ్రీనివాస్ ఇటీవల నటుడిగా, హీరోగా సినిమాలు చేస్తున్నాడు. గవిరెడ్డి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా నేడు ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరుపుకుంది.

దీంతో ఈ కార్యక్రమానికి గవిరెడ్డి శ్రీనివాస్ కోసం యువ దర్శకులంతా గెస్టులుగా హాజరయ్యారు.

గవిరెడ్డి శ్రీనివాస్ కొత్త సినిమా ఓపెనింగ్ కి బింబిసార, విశ్వంభర దర్శకుడు వశిష్ఠ, జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్, 90S సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్, సినిమా బండి దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల, నాంది, ఉగ్రం దర్శకుడు విజయ్ కనకమేడల హాజరయ్యారు.

వీరందరితో పాటు ఈ సినిమాని తెరకెక్కిస్తున్న నింద డైరెక్టర్ రాజేష్ జగన్నాధం కూడా ఈ ఫ్రేమ్ లో జాయిన్ అయ్యాడు. ఇలా గవిరెడ్డి శ్రీనివాస్, వశిష్ఠ, అనుదీప్, ఆదిత్య హాసన్, ప్రవీణ్ కాండ్రేగుల, విజయ్ కనకమేడల, రాజేష్ జగన్నాధం.. యువ దర్శకులంతా కలిసి ఫోటోలు దిగారు. వీరంతా కలిసి సెల్ఫీ కూడా తీసుకున్నారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
