కమెడియన్ సప్తగిరి హీరోగా నటిస్తున్నచిత్రం పెళ్ళికాని ప్రసాద్. అభిలాష్‌రెడ్డి గోపిడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రియాంకశర్మ కథానాయిక. కె.వై.బాబు, భానుప్రకాశ్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ నెల 21న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ విడుదల చేస్తుంది.
చిత్ర విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో మూవీ టీమ్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ట్రైలర్ విడుదల చేసింది. నాన్న.. 34, 36 అంటూ సప్తగిరి తన ఏజ్ చెప్పడంతో ట్రైలర్ మొదలైంది.
భారీ కట్నం ఇస్తేనే పెళ్లి అంటూ తండ్రి కండిషన్‌ను కాదనలేక.. ఏజ్ మీద పడుతున్నా పెళ్ళికానీ ప్రసాద్ పాత్రలో సప్తగిరి నవ్వులు పూయించాడు. మొత్తంగా ట్రైలర్ అదిరిపోయింది.
Sankranthiki Vasthunam : టీఆర్పీల దుమ్ముదులిపిన విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ..
లక్ష్మణ్, అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, బాషా, శ్రీనివాస్, ప్రభావతి, రోహిణి, రాంప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు.