Sara Ali Khan : మంచి పని చేసిన సారా అలీఖాన్.. రోడ్డు పక్క నిరాశ్రయుల కోసం..

తాజాగా సారా చేసిన ఓ పని వైరల్ గా మారింది. సారా చేసిన పని వీడియో రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Sara Ali khan Distribute food to Needy People in Mumbai Video goes Viral

Sara Ali Khan : బాలీవుడ్ భామ సారా అలీఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. తాజాగా సారా చేసిన ఓ పని వైరల్ గా మారింది. సారా చేసిన పని వీడియో రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ముంబైలోని జుహు ఏరియాలో ఉన్న శని ఆలయం వద్ద అక్కడ బయట ఉన్న నిరాశ్రయులు, బెగ్గర్స్ కి, ఆలయం పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సారా స్వయంగా వెళ్లి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసింది. కొన్ని ప్యాకింగ్ ఫుడ్స్ ని తీసుకొచ్చిన సారా అక్కడున్న వారికి స్వయంగా అందించింది. దీంతో సారా చేసిన ఈ పనిని పలువురు వీడియోలు తీయగా వైరల్ గా మారింది.

Also Read : Navdeep : పెళ్లి చేసుకోవట్లేదని.. పెళ్లి కార్డుపై సినిమా ప్రమోషన్స్ చేసుకుంటున్న నవదీప్..

ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ కొంతమంది మంచి పని చేసింది అని అభినందిస్తుండగా, మరి కొంతమంది చేసిన మంచిపని ప్రమోట్ చేసుకోవాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.