బ్రదర్‌తో బికినీలో – సారాపై నెటిజన్స్ ఫైర్..

సారా అలీఖాన్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

  • Published By: sekhar ,Published On : March 6, 2020 / 03:48 PM IST
బ్రదర్‌తో బికినీలో – సారాపై నెటిజన్స్ ఫైర్..

Updated On : March 6, 2020 / 3:48 PM IST

సారా అలీఖాన్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్‌ కూతురు సారా అలీఖాన్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సారా తన తల్లి అమృతా సింగ్‌తో కలిసి తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా వేకేషన్‌కు మాల్దీవ్స్ వెళ్లారు. ఆమె తన సోదరుడు ఇబ్రహీమ్ అలీఖాన్‌కి బర్త్‌డే పిషెస్ చెప్పడమే దీనంతటికీ కారణం..

Sara Ali Khan Trolled for Bikini Pose with Brother

పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకే ట్రోల్ చేస్తారా.. మా చెవిలో ఏమైనా చామంతి పూలు కనిపిస్తున్నాయా?.. అని సీరియస్ అవకండే.. మూమూలుగా విష్ చేస్తే పర్లేదు కానీ అప్పుడు సారా బికినీలో ఉండడం, షేర్ చేసిన పిక్స్, పెట్టిన పోజులు, అవి తీసుకున్న లొకేషన్స్ అభ్యంతరకరంగా ఉండడమే ఈ ట్రోలింగ్‌కి మెయిన్ రీజన్..

ఇక నెటిజన్స్ తిట్లదండకం అందుకున్నారు. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు తలో నాలుగు అక్షింతలు వేసేశారు. అవ్వా.. అక్క తమ్ముడితో బికినీలో ఏంటి.. ఆ పోజులేంటి.. మాకు తెలిసి తమ్ముడితో బికినీలో ఉన్న మొట్టమొదటి అక్కవి నువ్వే.. ఈ సందర్భంలో షేర్ చేయడానికి ఇది తప్ప వేరే ఫోటో దొరకలేదా తల్లీ నీకు.. అంటూ సారాను ఓ ఆటాడుకుంటున్నారు.