Sarath Kumar : సీనియర్ నటుడు శరత్ కుమార్‌కి మరోసారి కరోనా

తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు, నటి రాధిక భర్త శరత్‌ కుమార్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. శరత్ కుమార్ గతంలో కూడా ఓ సారి కరోనా.......

Sarath Kumar : సీనియర్ నటుడు శరత్ కుమార్‌కి మరోసారి కరోనా

Sarath Kumar

Updated On : February 3, 2022 / 7:29 AM IST

 

Sarath Kumar :  థర్డ్ వేవ్ లో క‌రోనా ఎవరిని వదలట్లేదు. ముఖ్యంగా సెలబ్రిటీలని. ఇటీవల అన్ని సినీ పరిశ్రమ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. కొంతమంది సెలబ్రిటీలకు కరోనా రెండవసారి, మూడవసారి కూడా సోకుతుంది. తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు, నటి రాధిక భర్త శరత్‌ కుమార్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. శరత్ కుమార్ గతంలో కూడా ఓ సారి కరోనా బారిన పడ్డారు.

Khiladi : డ్యూయల్ రోల్‌లో అనసూయ.. రవితేజకి అత్తగా??

శరత్ కుమార్ దీనిపై ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ”నా సన్నిహితులు, బంధువులు, స్నేహితులు శ్రేయోభిలాషులందరికీ శుభ సాయంత్రం. ఈ రోజు సాయంత్రం నాకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవల కాలంతో నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను” అంటూ శరత్‌ కుమార్‌ పోస్ట్ చేశారు. రెండో సారి కరోనా బారిన పడటంతో మరింత జాగ్రత్తగా ఉండి, అన్ని మెడిసిన్స్, జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.