సంక్రాంతి విన్నర్ ఎవరో? సోమవారం తెలిసిపోతుంది!
సరిలేరు నీకెవ్వరు, అల... వైకుంఠపురములో... సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి..

సరిలేరు నీకెవ్వరు, అల… వైకుంఠపురములో… సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల… వైకుంఠపురములో’ సినిమాలు సంక్రాంతి కానుకగా ఒకరోజు అటు ఇటుగా భారీ స్థాయిలో విడుదలయ్యాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే రెండు సినిమాలు పాజిటివ్ టాక్ అండ్ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ సత్తా చాటుతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘దర్బార్’ హిట్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు రాబట్టినా తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ
థియేటర్స్ అయితే లేవు.
జనవరి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సాధారణంగా సంక్రాంతి సీజన్‌లో ఎటువంటి సినిమా వచ్చినా తప్పకుండా ఆడుతుంది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. సరిలేరు, వైకుంఠపురం సినిమాల విషయానికొస్తే సంక్రాతి బాక్సాఫీస్ మొగుడు, బ్లాక్ బస్టర్ కా బాప్, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ బ్లాక్ బస్టర్ అని అసలైన సంక్రాంతి విన్నర్ అని ఎవరికి వారు ప్రకటించేస్తున్నారు. అంతే కాక ఈ రెండు సినిమాలూ కొన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేశాయని కూడా చెప్తున్నారు.
ఆడియన్స్ ఫైనల్ టాక్ ఏంటంటే.. ‘‘అనిల్ రావిపూడి తన సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌కి పెద్ద పీట వేస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి హిట్ కొట్టడంలో సిద్ధహస్తుడు.. అలాంటి డైరెక్టర్‌కి మహేష్ లాంటి స్టార్ హీరో దొరికితే మామూలుగా ఉండదు మరి.. ముఖ్యంగా మాస్‌కి నచ్చే యాక్షన్, కామెడీ వంటి అంశాలు ఉండడంతో సరిలేరు నీకెవ్వరు సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన మార్క్ కథ, కథనాలు, పంచ్‌లతో అల వైకుంఠపురములో చిత్రాన్ని ఫ్యాన్స్ అండ్ క్లాస్ ఆడియన్స్‌కి మాత్రమే కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దడంతో మాస్ ప్రేక్షకులు అంతగా అడాప్ట్ చేసుకోలేకపోతున్నారని.. సినిమా ఏదో ఫ్లోలో అలా వెళ్లిపోతుంది కానీ ఇది హైలెట్ అని చెప్పడానికి ఏమీ లేదు’’..
ఇది పబ్లిక్ టాక్ అయితే.. ట్రేడ్ వర్గాలవారి మాట ఏంటయ్యా అంటే.. ‘‘ఈ కలెక్షన్స్, రికార్డ్స్ గోల పక్కన పెడితే.. పండగ సీజన్ పైగా లాంగ్ వీకెండ్ కావడంతో ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది హైయ్యెస్ట్ వసూళ్లు రాబడుతుంది? మహేష్, బన్నీఇద్దరిలో ఎవరు అసలైన సంక్రాంతి విన్నర్ ఎవరు? అనేది తెలియాలంటే వచ్చే సోమవారం వరకూ ఆగితే తెలిసిపోతుంది. ఫెస్టివల్ లేదా వీకెండ్‌లో బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేయడం గొప్పేం కాదు కానీ వీక్ స్టార్టింగ్ లేదా వీక్ డేస్‌లో
జనాలను థియేటర్లకు రప్పించడాన్ని బట్టే సదరు సినిమా జాతకం తెలిసిపోతుంది కాబట్టి ఈ రెండు సినిమాల సంగతి ఏంటనేది రాబోయే సోమవారం తెలిసిపోతుంది’’.. అంటున్నారు ట్రేడ్ పండితులు..