కేరళలో ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ సందడి

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న‘సరిలేరు నీకెవ్వరు’ ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుపుకుంటోంది..

  • Publish Date - November 9, 2019 / 06:19 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న‘సరిలేరు నీకెవ్వరు’ ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుపుకుంటోంది..

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా.. ‘సరిలేరు నీకెవ్వరు’.. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్అజయ్ కృష్ణగా కనిపించనున్నాడు. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు షూటింగ్ కేరళ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.. 

సినిమాలో కీలకమైన పలు సన్నివేశాలను కేరళలోని అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా  యూనిట్ అంతా కలిసి దిగిన ఓ ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్ర‌కాష్ రాజ్ పంచె క‌ట్టులో క‌న‌ప‌డితే.. మ‌హేశ్ ఆర్మీ డ్రెస్‌లో క‌న‌ప‌డ్డారు. రష్మిక, విజయశాంతి, రాజేంద్రప్రసాదర్, సంగీత, రఘుబాబు, డీఓపీ రత్నవేలు, నిర్మాత అనిల్ సుంకర తదితరులు ఈ ఫోటోలో కనిపించారు.

Read Also : సల్లూ భాయ్ సినిమాలో ‘ప్రేమిస్తే’ భరత్

త్వరలో సరిలేరు నీకెవ్వరు టీజర్ రిలీజ్ చేయనున్నారు.. రాక్ స్టార్ డీఎస్పీ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.