సూపర్ స్టార్ మహేష్ బాబు మేజర్అజయ్ కృష్ణగా కనిపించనున్న‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ నవంబర్ 22న విడుదల..
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా.. ‘సరిలేరు నీకెవ్వరు’.. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్అజయ్ కృష్ణగా కనిపించనున్నాడు. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు షూటింగ్ కేరళ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.. కేరళ అడవుల్లో పోరాట దృశ్యాలు చిత్రీకరిస్తున్నారు.
మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టీజర్ కోసం నవంబర్ 19 మంగళవారం సాయంత్రం 6గంటల 3నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడానికి సూపర్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అయిపోయారు. టీజర్ వచ్చేస్తుందహో.. అనుకుంటుండగా.. నవంబర్ 22న ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ రిలీజ్ చేయబోతున్నామంటూ న్యూ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.
Read Also : బాధితుడిలా కాదు.. రిపోర్టర్‌లా ఆలోచించాలి : ‘అర్జున్ సురవరం’ ట్రైలర్
నవంబర్ 23న డైరెక్టర్ అనిల్ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందు 22న టీజర్ రిలీజ్ చేయనున్నారు. విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్, సంగీత తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
I have Unlocked #SarileruNeekevvaru Teaser Date?. Now it's ur turn to Unlock. Super Star @urstrulyMahesh @AnilRavipudi #SarileruNeekevvaruTeaserOnNov22nd
— Anil Ravipudi (@AnilRavipudi) 19 November 2019