‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ వచ్చేస్తోంది!

నవంబర్ 19 మంగళవారం సాయంత్రం 6గంటల 3నిమిషాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ విడుదల..

  • Publish Date - November 19, 2019 / 07:11 AM IST

నవంబర్ 19 మంగళవారం సాయంత్రం 6గంటల 3నిమిషాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ విడుదల..

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా.. ‘సరిలేరు నీకెవ్వరు’.. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్అజయ్ కృష్ణగా కనిపించనున్నాడు. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు షూటింగ్ కేరళ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.. 

Read Also : అంచనాలు పెంచేసిన ‘తానాజీ : ది అన్‌సంగ్ వారియర్’ – ట్రైలర్

కేరళ అడవుల్లో పోరాట దృశ్యాలు చిత్రీకరిస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా మూవీ టీమ్ టీజర్ అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్ 19 మంగళవారం సాయంత్రం 6గంటల 3నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడానికి సూపర్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అయిపోయారు.

విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్, సంగీత తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ డీఎస్పీ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.