‘బాహుబలి’ని బీట్ చేసిన సూపర్ స్టార్ సినిమా..

‘సరిలేరు నీకెవ్వరు’ బుల్లితెరపై సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది..

  • Published By: sekhar ,Published On : April 2, 2020 / 12:20 PM IST
‘బాహుబలి’ని బీట్ చేసిన సూపర్ స్టార్ సినిమా..

Updated On : April 2, 2020 / 12:20 PM IST

‘సరిలేరు నీకెవ్వరు’ బుల్లితెరపై సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది..

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా విడుదలై విజయఢంఖా మోగించడమే కాక మహేష్ కెరీర్‌‌లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. తాజాగా బుల్లితెరపై కూడా ‘సరిలేరు’ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ చిత్రాన్ని ఉగాది టెలివిజన్ ప్రీమియర్‌గా మార్చి 25న జెమినీ టీవీలో టెలికాస్ట్ చేశారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో ఈ చిత్రం అత్యధిక టీఆర్పీని సొంతం చేసుకుని సంచలన రికార్డ్‌ నమోదు చేయడం విశేషం. బుల్లితెరపై ఇప్పటి వరకు ఉన్న ‘బాహుబలి’ రికార్డ్‌ను మహేష్ మూవీ బీట్ చేసింది.

Read Also : కూతురికి శ్రద్ధాంజలి.. పూలదండ కూడా వేయలేకపోయిన ‘‘ఆనంది’’ తండ్రి..

ఉగాది రోజు ప్రసారమైన ఈ చిత్రానికి 23.4 టీఆర్పీ వచ్చినట్లుగా సదరు ఛానెల్ అధికారికంగా ప్రకటించింది. అంతకు ముందు ‘బాహుబలి’ పేరిట ఉన్న 22.7 టీఆర్పీ రేటింగ్‌ను ఈ చిత్రం అధిగమించి టాప్ స్థానాన్ని సొంతం చేసుకుంది. ‘బాహుబలి’ తర్వాత స్థానంలో మళ్లీ మహేష్ బాబు సినిమానే ఉండటం మరో విశేషం. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రం 22.54 టీఆర్పీని సాధించగా ఈ చిత్రం మూడో స్థానానికి పరిమితమైంది. మొత్తంగా చూస్తే కరోనా వైరస్ కారణంగా జనం ఇళ్లకే పరిమితమవడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.