Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట.. ఒకటి కాదు రెండు సినిమాలు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ పనులను ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఫుల్ స్వింగ్‌లో...

Sarkaru Vaari Paata To Have Geetha Govindam Pokiri Elements

Sarkaaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ పనులను ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఫుల్ స్వింగ్‌లో జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తీర్చిదిద్దడంతో, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మహేష్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఈ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ అప్పుడే మొదలుపెట్టింది.

Sarkaru Vaari Paata: ప్రమోషన్లు షురూ.. రంగంలోకి దిగనున్న మహేష్!

ఈ క్రమంలోనే ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘సర్కారు వారి పాట’కు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ఈ సినిమాలో మహేష్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉంటుందని.. ఇప్పటివరకు మహేష్ కెరీర్‌లో ఇదే బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ చాలా చక్కగా నటించిందని.. వారిద్దరి కెమిస్ట్రీ చూస్తే ప్రేక్షకులు ముచ్చటపడతారని ఆయన తెలిపారు. ముఖ్యంగా సర్కారు వారి పాట ఫస్టాఫ్‌లో మహేష్-కీర్తి మధ్య నడిచే లవ్ ట్రాక్ చాలా ఫన్నీగా ఉంటుందని, ఎమోషన్స్ కూడా బాగా పండాయని ఆయన అన్నారు. అటు సెకండాఫ్‌లో సినిమా పూర్తిగా సీరియస్ మోడ్‌లోకి వెళ్లి యాక్షన్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ఆయన తెలిపారు.

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్..?

ఒకరకంగా సర్కారు వారి పాట సినిమా చూస్తుంటే, మనకు గీతా గోవిందం, పోకిరి సినిమాలు గుర్తుకు వస్తాయని.. ఈ రెండు సినిమాల్లోని షేడ్స్ మనకు ఇందులో కనిపిస్తాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇలా సర్కారు వారి పాట సినిమాపై హీరో దగ్గర్నుండి, టెక్నీషియన్స్ వరకు అందరూ అంచనాలు పెంచుతుండటంతో ఈ సినిమా మహేష్ కెరీర్‌లో ఎలాంటి ఘన విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. సమ్మర్ ట్రీట్‌గా ఈ సినిమాను మే 12న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.